పోలీసులకు తప్పడం లేదు క్వారంటైన్..
కరోనా కరోనా ఈ మాట వింటుంటే గుండెల్లో వణుకు పుడుతుంది. ఎన్నడూ లేని విధంగా మనుషులు ఈ వైరస్ పేరు చెబితే గుండె గుభేల్ అంటుంది. చైనాలో పుట్టుకొచ్చిన ఈ మాయదారి వైరస్ కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది. దేశంలో కరోనా కట్టడి చేయడానికి లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే. అప్పట నుంచి పోలీసులు రంగంలోకి దిగి.. గట్టి బందోబస్తు చేస్తున్నారు. కరోనా కోసం పోరాడుతున్న పోలీసులకు కూడా కరోనా భయం తప్పడంలేదు ఏదో ఒక కారణాలతో.. కరోనా క్వారెంటైన్ కి ఏపీ నుండి ముగ్గురు, తెలంగాణా నుండి మరో అధికారిని క్వారెంటైన్ కి తరలించారు.
తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి వన్‌టౌన్ ఎస్‌ఐ, టూటౌన్ హెడ్ కానిస్టేబుల్, కారు డ్రైవర్‌గా ఉన్న కానిస్టేబుల్‌ను క్వారంటైన్‌కు తరలించారు అధికారులు. రాజమండ్రి మంగళరావుపేటకు చెందిన ఆర్‌ఎంపికి కరోనా సోకింది. ఆర్‌ఎంపీతో కాంటాక్ట్ అయినందుకు ఎస్‌ఐని, బీపీ టెస్ట్‌లు చేయించుకున్న హెడ్‌కానిస్టేబుల్‌ను డ్రైవర్‌గా వెళ్లిన కానిస్టేబుల్‌ను క్వారంటైన్‌కు తరలించారు.
ఈ ముగ్గురితో పాటు పీఎస్‌లోని పోలీసులందరికీ శ్లాబ్ టెస్ట్లు చేస్తున్నారు. పశ్చిమగోదావరి జిల్లా తెలంగాణ సరిహద్దు ప్రాంతం జీలుగుమిల్లి ఎస్‌ఐని హోంక్వారంటైన్ చేశారు అధికారులు. ఎస్‌ఐ అనుమతి లేకుండా తెలంగాణలోని సత్తుపల్లిలో ఉంటున్న తన అత్తగారింటికి రోజూ వెళ్లి.. డ్యూటీకి జీలుగుమిల్లికి వస్తున్నారు. ఇది గమనించిన అధికారులు ఎస్‌ఐని హోంక్వారంటైన్ చేశారు. ఇలా పోలీసులను కూడా కరోనా వదలకుండా పట్టి పీడిస్తుంది.
కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్ :
NIHWN వారి సంజీవన్ మీకు కల్పిస్తోన్న ఈ అవకాశం.. కరోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.
Google: https://tinyurl.com/NIHWNgoogle
Apple : https://tinyurl.com/NIHWNapple