కరోనాపై యుద్దం: డాక్టర్లకు మాస్క్‌లు, పీపీ కిట్లు వెంటనే ఇవ్వాలి : హైకోర్టు
దేశంలో నానాటికీ పెరిగిపోతున్న కరోనా మహమ్మారి కేసులను అరికట్టేందుకు కేంద్ర గట్టి చర్యలే తీసుకుంటుంది. దేశ వ్యాప్తంగా కరోనా బాధితులను ఆదుకుంటున్న వైద్యులకు కొంత మందికి ఈ కరోనా వల్ల ముప్పు వాటిల్లుతుందని వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. అక్కడక్కడ కొంత మంది వైద్యులు కూడా చనిపోయారు. ఈ నేపథ్యంలో కరోనా బాధితులకు వైద్యం చేస్తున్న వైద్యులకు తప్పనిసరిగా మాస్క్‌లు, పీపీ కిట్లు అందించాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. మంగళవారం హైకోర్టులో కరోనా నివారణలో ప్రభుత్వ చర్యలపై విచారణ జరిగింది.
వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ జరిపిన హైకోర్టు ధర్మాసనం.. ప్రభుత్వానికి పలు సూచనలు, ఆదేశాలు జారీ చేసింది. కాగా, తెలంగాణలో కరోనా నివారణకు సరైన చర్యలు తీసుకునేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని హైకోర్టును పిటిషనర్ కోరారు. కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రతి జిల్లాలోనూ కరోనా సెంటర్లు ఏర్పాటు చేయాలని పిటీషనర్ కోరడం జరిగింది. దీనిపై స్పందించి ప్రభుత్వ తరఫున న్యాయవాది.. కరోనా నివారణకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని చెప్పారు.
ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 329 కంటైన్మైంట్ ప్రాంతాలను ఏర్పాటు చేసినట్లు కోర్టుకు తెలిపారు. ఇరు పక్షాల వాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం.. కరోనా నివారణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. అంతే కాదు కరోనాపై రాష్ట్రం తీసుకుంటున్న చర్యలకు సంబంధించిన వివరాలను తెలియజేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.. తర్వాత విచారణ మే 8 కి వాయిదా వేసింది.
కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్ :
NIHWN వారి సంజీవన్ మీకు కల్పిస్తోన్న ఈ అవకాశం.. కరోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.
Google: https://tinyurl.com/NIHWNgoogle
Apple : https://tinyurl.com/NIHWNapple