1532 బదులు లక్షా 53 వేల ఫోను బిల్లు ?

Kaumudhi

మ‌నం యాప్స్ ద్వారా బిల్లులు చెల్లిస్తున్న‌ప్పుడు ఒక్కోసారి అనూహ్యంగా ఎక్కువ‌మొత్తంలో డ‌బ్బులు క‌ట్ అవుతుంటాయి. అదృష్టం బాగుంటే తిరిగి డిపాజిట్ అవుతాయి.. లేదంటే..అంతే సంగ‌తులు..! తాజాగా.. న‌టి కామ్య పంజాబీ కూడా ఇలాంటి అనుభవాన్నే ఎదుర్కొంది. ఇటీవల తన టెలికం బిల్లు చెల్లించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు భారీ మొత్తంలో డ‌బ్బులు క‌ట్ అయ్యాయి. ఒక యాప్ ద్వారా రూ .1532 చెల్లిస్తుండ‌గా.. ఒక్క‌సారిగా రూ 1.53 లక్షలు చెల్లించిన‌ట్లు మెసేజ్ రావ‌డంతో అమె కంగుతిన్న‌ది. ఇంత భారీ మొత్తంలో డ‌బ్బులు చెల్లించిన‌ట్లు మెసేజ్ రావ‌డంతో ఆమె న‌మ్మ‌లేక‌పోయింది. ఇలా ఎలా జ‌రిగింద‌ని స‌ద‌రు కంపెనీ ప్ర‌తినిధిని అడిగినా లాభం లేకుండాపోయింది.

 

ఈ విష‌యాన్ని వెంట‌నే ఆమె ట్విట్ట‌ర్ ద్వారా వెల్ల‌డించింది. ఆ బిల్లుల‌ను స్ర్కీన్ షాట్ల‌ను తీసి పోస్ట్ చేసింది. యాప్స్ ద్వారా బిల్లులు చెల్లిస్తున్న‌పుడు జాగ్ర‌త్త‌గా ఉండాలంటూ ఈ సంద‌ర్భంగా ఆమె ట్వీట్ చేసింది. అయితే.. ఆ త‌ర్వాత టెలికం సంస్థ కూడా స్పందించింది. ఈ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించేందుకు ప్ర‌య‌త్నం చేస్తున్న‌ట్లు ఆమెకు స‌మాచారం అందించారు. ఈ విష‌యం సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతోంది. అందుకే.. యాప్స్ ద్వారా బిల్లులు చెల్లిస్తున్న‌ప్పుడు జాగ్ర‌త్త సుమా..!

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: