కరోనా ఎఫెక్ట్... హౌసింగ్‌కు ఆర్బీఐ బంపర్ ఆఫర్ ఇచ్చిందిగా...
కరోనా నేపథ్యంలో దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ఆర్బీఐ రంగంలోకి దిగింది. ఈ క్రమంలోనే ఆర్బీఐ ప్రస్తుత సంక్షోభాన్ని నివారించేందుకు పలు సంస్కరణలు చేపడుతున్నట్టు ప్రటించింది. ఇందుకోసం అనేక రంగాలను ఆదుకునేందుకు భారీ మొత్తంలో నిధులు ఇస్తామని ప్రకటన చేసింది.ఈ మేరకు శక్తికాంత్ దాస్ శుక్రవారం ఉదయం ఈ వివరాలు వెల్లడించారు. లాక్‌డౌన్ తర్వాత 1.20 లక్షల కోట్లు విడుదల చేసినట్టు ఆయన తెలిపారు.
చిన్నతరహా పరిశ్రమలను ఆదుకునేందుకు ఆఫర్లు ప్రకటించిన ఆర్బీఐ.. పరిస్థితి సమీక్షించి అవసరం అయితే మరింత సాయం అందిస్తామని కూడా ప్రకటించింది. మార్కెట్లపై ఆర్థికభారం లేకుండా పలు చర్యలు తీసుకుంది. ఇక ఓవరాల్‌గా లాక్‌డౌన్ వల్ల దేశం మొత్తం మీద ఇప్పటికే 30 శాతం విద్యుత్ వినియోగం తగ్గిందని శక్తికాంత్ దాస్ ప్రకటించారు. ఇక రాష్ట్రాలకు 60 శాతం మేర డబ్లూఎంఏ పెంపు ఉంటుందని ఆయన తెలిపారు.
కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్ :
NIHWN వారి సంజీవన్ మీకు కల్పిస్తోన్న ఈ అవకాశం.. కరోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.
Google: https://tinyurl.com/NIHWNgoogle
apple : https://tinyurl.com/NIHWNapple