మోదీకి యాంటీగా కేసీఆర్... సంచలన నిర్ణయం తప్పదా..!
తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రధానమంత్రి నరేంద్రమోదీ నిర్ణయానికి అనుకూలంగా కాకుండా తనదైన శైలీలో ముందుకు వెళ్లనున్నారా ? కరోనాపై పోరాటంలో భాగంగా కేసీఆర్ తన రాష్ట్ర ప్రజలను కాపాడుకునేందుకు సంచలన నిర్ణయం తీసుకోనున్నారా ? అంటే అవుననే ఆన్సర్లే వినిపిస్తున్నాయి. మోదీ మే 3వ తేదీ వరకు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమల్లో ఉంటుందని.. చెప్పినా ఈ నెల 20వ తేదీ వరకు చాలా స్ట్రిక్ట్‌గా లాక్‌డౌన్ అమలు చేస్తామని ఆ తర్వాత పరిస్థితులను బట్టి సడలింపులు ఉంటాయని చెప్పిన సంగతి తెలిసిందే.
అయితే తెలంగాణలో రోజు రోజుకు కరోనా తీవ్రంగా విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలో కేసీఆర్ ఈ నెల 20 తర్వాత కూడా తెలంగాణలో మినహాయింపు ఇచ్చే పరిస్థితి లేదని తెలుస్తోంది. కేంద్రం ప్రకటించిన మినహాయింపుల అమలుకు రాష్ట్ర ప్రభుత్వం విముఖంగా ఉందట. ఏ రంగానికి సడలింపు ఇచ్చినా కరోనా నియంత్రణ కష్టమని భావనఈ నెలాఖరు వరకు లాక్‌డౌన్ పకడ్బందీగా అమలుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుందని సమాచారం. ఎల్లుండి కేబినెట్ భేటీలో సీఎం కేసీఆర్ తుది నిర్ణయం తీసుకోనున్నారట.
కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్ :
NIHWN వారి సంజీవన్ మీకు కల్పిస్తోన్న ఈ అవకాశం.. కరోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.
Google: https://tinyurl.com/NIHWNgoogle
apple : https://tinyurl.com/NIHWNapple