బర్త్ డే : నీయవ్వ తగ్గేదేలే... లెక్కల మాష్టారు లెక్క తప్పేదే లే !

Vimalatha
తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న దిగ్గజ ఫిల్మ్ మేకర్స్ లో సుకుమార్ కూడా ఒకరు. సుకుమార్ 2004లో 'ఆర్య'తో దర్శకుడిగా అరంగేట్రం చేసాడు. ఆ సినిమా విజయం సుకుమార్ కు స్టార్ డైరెక్టర్ స్టేటస్ ను అందించింది. 'ఆర్య' చిత్రానికి గానూ సుకుమార్ ఉత్తమ దర్శకుడిగా, తెలుగు ఉత్తమ స్క్రీన్ ప్లే రచయితగా నంది అవార్డును అందుకున్నాడు. జగడం (2007), ఆర్య 2 (2009), 100% లవ్ (2011), 1: నేనొక్కడినే (2014), నాన్నకు ప్రేమతో (2016), రంగస్థలం (2018) పుష్ప (2020) చిత్రాలతో టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ నుంచి ఇండియన్ స్టార్ డైరెక్టర్స్ లిస్ట్ లో చేరిపోయారు సుకుమార్. దర్శకుడు తన సినిమాల పాత్రలలో గ్రే షేడ్స్‌ను నింపగల సామర్థ్యంతో మహేష్ బాబు నుండి రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, బన్నీ వంటి స్టార్స్ ను విభిన్నంగా చూపించాడు. ఈరోజు ఆయన పుట్టినరోజు గురించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను చూద్దాం.
సుకుమార్ అసలు పేరు సుకుమార్ బండ్రెడ్డి. జననం 11 జనవరి 1970న తూర్పు గోదావరి జిల్లా రాజోలు సమీపంలోని మెట్టపర్రులో జన్మించారు. సుకుమార్ కాకినాడలోని ఆదిత్య జూనియర్ కళాశాలలో ఒక గణిత, భౌతిక లెక్చరర్ గా దాదాపు ఆరు సంవత్సరాలు పని చేశారు. ఆ తరువాత రచయిత నుంచి డైరెక్టర్ గా మారారు.  
సహాయ దర్శకుడు
క్షేమంగా వెళ్లి లాభంగా రండి (2000), హనుమాన్ జంక్షన్ (2001) చిత్రాలకు జయం రాజా తండ్రి మోహన్‌కి సుకుమార్ అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశారు. సుకుమార్ దిల్ (2003) చిత్రానికి వివి వినాయక్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేశాడు.
సుకుమార్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి '1: నేనొక్కడినే' అనే చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్‌తో కలిసి పని చేశారు.
నిర్మాతగా మారిన వేళ...
సుకుమార్ రైటింగ్స్ బ్యానర్‌లో సుకుమార్ "కుమారి 21 ఎఫ్" అనే సినిమాతో నిర్మాతగా మారారు. 2015లో వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్.
శాఖాహారిగా మారిన సమయం
6 సంవత్సరాల వయస్సులో ఆయనకు ఇష్టమైన కోడిని చంపిన తరువాత, సుకుమార్ శాఖాహారాన్ని తినడం ప్రారంభించాడు.
'పుష్ప' ఫైర్ తగ్గేదే లే !
సుకుమార్ తొలి చిత్రం 'ఆర్య' 40 మిలియన్ల బడ్జెట్‌తో రూపొంది రూ.160 మిలియన్లు వసూలు చేయడంతో వాణిజ్యపరంగా విజయవంతమైంది. 'ఆర్య' విజయం సుకుమార్‌ను రాత్రికి రాత్రే టాలీవుడ్ లో స్టార్‌డైరెక్టర్ ను చేసేసింది ఈ సినిమా. ఇప్పుడు మరోసారి బన్నీ, సుకుమార్ కాంబోలో వచ్చిన 'పుష్ప' ఫైర్ ఇంకా చల్లారలేదన్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: