ప్రభుదేవాను పాజిటివిటీగా మార్చిన నయన్ !
నయనతార అసలు పేరు డయానా మరియం కురియన్. ఆమె బెంగుళూరులో జన్మించింది. నయన్ తల్లిదండ్రులు కురియన్ కొడియట్టు, ఓమన కురియన్. వీరిది కేరళకు చెందిన కుటుంబం. ఆమె అన్నయ్య లెనో, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని దుబాయ్‌లో నివసిస్తున్నారు. ఆమె తండ్రి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారి కావడంతో నయనతార భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో ఎక్కువగా ఉత్తర భారతదేశంలో చదువుకున్నారు. పలు పాఠశాలల్లో ప్రాథమిక విద్యను పూర్తి చేసిన నయన్ తిరువల్ల, మార్థోమా కాలేజ్ లో ఆమె బ్యాచిలర్స్ డిగ్రీ లో ఇంగ్లీష్ లిటరేచర్ పూర్తి చేశారు.
ఇక ఈ బ్యూటీ సినిమాల్లోకి వచ్చాక లేడీ సూపర్ స్టార్ గా ఎదిగింది. అయితే అంతకన్నా ముందు ఆమె ఎక్కువగా వివాదాల్లో నిలిచింది. ముఖ్యంగా ప్రభుదేవాతో డేటింగ్, బ్రేకప్ ఆమెను బాగా కుంగదీశాయి. భార్యకు విడాకులు ఇచ్చి నయన్ ను పెళ్లి చేసుకోవడానికి రెడీ అయిపోయిన ప్రభుదేవా... ఆ తరువాత ఇద్దరి మధ్య బ్రేకప్ వచ్చేసింది. కొంతకాలం ఆ బాధలో ఉండి కోలుకున్న నయన్ అంతవరకూ తన చేతిపై ప్రభుదేవా పేరును పచ్చబొట్టుగా వేసుకోగా, బ్రేకప్ అయ్యాక మాత్రం దానిని పాజిటివిటీగా మార్చేసింది. అలా నయన్ జీవితంలో ప్రభుదేవా కాస్తా పాజిటివిటీగా మారాడన్న మాట.