మరో 'మహానటి' కీర్తి సురేష్

Vimalatha
కీర్తి సురేష్ కు సౌత్ లో విశేషమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. లెజెండరీ నటి సావిత్రి తరువాత 'మహానటి'గా అందరి మన్ననలు అందుకుంటున్న కీర్తి పుట్టిన రోజు నేడు. 1992 లో జన్మించిన కీర్తి, నిర్మాత సురేష్ కుమార్, నటి మేనకా కుమార్తె. ఆమె చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమా రంగంలోకి అడుగు పెట్టింది. మాత్రం 2000 సంవత్సరంలో వెండి తెరపైకి ఎంట్రీ ఇచ్చింది. అంటే 8 సంవత్సరాల వయస్సులో. ఆ తర్వాత ఆమె ఫ్యాషన్ డిజైన్‌ రంగంలో ప్రావీణ్యం సంపాదించింది. తర్వాత 2013 లో 'గీతాంజలి' అనే మలయాళ చిత్రంలో ప్రధాన పాత్రలో నటించింది.
అక్కడి నుంచి మొదలైన ఆమె ప్రయాణం 'మహానటి' వరకు అంత సజావుగా ఏమీ సాగలేదు. ఎన్నో ప్లాప్ లు, విమర్శలు ఎదుర్కున్నాకే కీర్తి ఈ స్థాయిలో నిలబడింది. 'నేను శైలజ' చిత్రంలో అందమైన ముఖంతో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన కీర్తి ఆ తరువాత వరుస ఛాన్సులు పట్టేస్తూ 'మహానటి'లో అవకాశం దక్కించుకుంది. ఈ చిత్రం ఆమె జీవితాన్నే మార్చేసింది. అప్పటి వరకూ అడపాదడపా హిట్లు అందుకుంటూ యావరేజ్ హీరోయిన్ గా ఉన్న కీర్తిలో అందరూ సావిత్రిని మాత్రమే కన్పించేలా నటించి తెలుగు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. అంతేకాదు ఈ సినిమాతో జాతీయ అవార్డును సైతం సొంతం చేసుకుంది.
ఇక అప్పటి నుంచి తనదైన శైలిలో సినిమాలను ఎంచుకుంటోంది. దాదాపుగా గ్లామర్ కు దూరంగా ఉంటూ 'మహానటి' ఫేమ్ ను కాపాడుకునే ప్రయత్నం చేస్తోంది. ఒకవైపు లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూనే మరోవైపు స్టార్ హీరోలతో రొమాన్స్ చేస్తోంది. ఏం చేసినా ఆమె అంటే చెరగని ముద్ర చేసుకున్న ప్రేక్షకుల మనోభావాలు దెబ్బతినకుండా చూసుకుంటోంది. మరోవైపు బాలీవుడ్ లోనూ ఎంట్రీకి సిద్ధమైంది. ఈరోజు ఆమె పుట్టిన రోజు సందర్భంగా కీర్తికి అభిమానుల నుంచి పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: