నువ్వు మానసికంగా స్ట్రాంగ్ అవ్వాలంటే తల్లిదండ్రులు చేయాల్సినవివే?

lakhmi saranya
పిల్లలు శారీరకంగా, మానసికంగా స్ట్రాంగ్ గా ఉంటేనే ఏదైనా సాధించగలం అనే నమ్మకం వారిలో ఏర్పడుతుంది. కానీ ఇటీవల చాలామంది పిల్లలు ఒత్తిడి పలు కారణాలతో మానసికంగా ఇబ్బందుల్ని ఫేస్ చేస్తున్నారు. కాగా పిల్లలు మానసికంగా ఆరోగ్యంగా పెరిగేందుకు నిపుణులు చెప్పిన పలు సూచనలు చూద్దాం. పిల్లలతో తల్లిదండ్రులు తరచూ మాట్లాడుతూ ఉండాలి. వారి సమస్యల్ని అడిగి తెలుసుకోండి. దీంతో వారిలోని భయాన్ని, ఒత్తిడి తగ్గిపోతుంది. పిల్లల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీ పిల్లలకు సామాజిక నైపుణ్యాలు నేర్పించాలి. ఇతరులతో ఎలా మాట్లాడాలి? ఎలాంటి వారిలో స్నేహం చేయాలి?
అనే విషయాలు చెప్పాలి. ఎదుటివారి మనోభావాలు కూడా రెప్పెక్ట్ ఇవ్వటం వంటివి నేర్పించాలి. పెద్దలకైనా, పిల్లలకైనా సరైన సమయానికి మంచి నిద్ర అవసరం. నిద్ర సరిగ్గా పోకపోతే ఒత్తిడి పెరిగిపోయి.. మానసికంగా బాధపడుతుంటారు. కాగా నాణ్యమైన ఆహారం, మంచి నిద్ర ఆరోగ్యానికి మేలు చేస్తుంది. పిల్లల పట్ల ప్రేమ చూపించాలి. వారు అడిగిన వస్తువుల్ని... అవసరమైనవి కొనివ్వాలి. అంతేకాకుండా పిల్లలపై సానుభూతి చూపిస్తూ ఉండాలి. ఎప్పుడైనా సరే పిల్లలపై అరవకూడదు. తప్పు చేస్తే ఆ తప్పును వివరించి వారికి అర్థమయ్యేలా చెప్పాలి. పిల్లలు మానసికంగా ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి రోజు యోగ, ధ్యానం చేయాలి.
ఇది పిల్లల్లోని ఆందోళన, ఒత్తిడి వంటి సమస్యల్ని దూరం చేస్తుంది. సరైన ఆహారం తీసుకోవాలి. తల్లిదండ్రులు పిల్లల్ని ప్రేరేపించే మాటలు మాట్లాడాలి. మీరు ఏదైనా చేయగలరు అనే నమ్మకం వారిలో తీసుకోవాలి. కాగా పిల్లలక స్ఫూర్తిదాయకమైన, శక్తివంతమైన కథలు చెప్పాలి. ఇవి పిల్లతో నమ్మకం, ధైర్యాన్ని తీసుకొస్తాయి. అలాగే పిల్లల్ని తరచూ చదువు పైనే దృష్టి పెట్టాలని ఫోర్స్ చేయకుండా కాసేపు ఆడుకోనివ్వండి. ఎక్కువగా సృజనాత్మకమైన ఆటల్లో పాల్గోనమని చెప్పండి. ఫిజికల్ యాక్టివిటిస్ పిల్లల్లో ఆనందాన్ని కలిగిస్తాయి. పిల్లల కోల్ ఏంటో అడిగి తెలుసుకోండి. వారి అభిప్రాయాలకు గౌరవం ఇవ్వండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: