వైరల్: స్టేషన్ బాత్రూంలో అడ్డంగా బుక్ అయినా కీచక పోలీస్.?

FARMANULLA SHAIK
పోలీస్ స్టేషన్‌కు వచ్చిన మహిళతో ఓ డీఎస్పీ.. ఏకంగా బాత్రూంలోనే రాసలీలలు సాగించిన ఘటన ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆ మహిళతో డీఎస్పీ చేసిన పాడుపనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.తుమకూరు జిల్లా మధుగిరి పట్టణం పావగడకు చెందిన ఓ యువతి.. భూ వివాదంపై ఫిర్యాదు చేసేందుకు మధుగిరి డీఎస్పీ ఆఫీస్‌కు వెళ్లింది. అయితే ఆ యువతిని స్టేషన్‌లోని బాత్రూంలోకి తీసుకెళ్లిన డీఎస్పీ రామచంద్రప్ప. ఆ మహిళతో రొమాన్స్ చేశాడు. యూనిఫాంలో ఉన్న డీఎస్పీ రామచంద్రప్ప, ఆ మహిళకు సంబంధించిన వీడియోను ఆ మహిళతోపాటు వచ్చిన మరో మహిళ.. ఎవరికీ తెలియకుండా కిటికీలో నుంచి వీడియోను రికార్డ్ చేసింది. ఆ మహిళతో బాత్రూంలో డీఎస్పీ జరిపిన రాసలీలలకు సంబంధించిన దృశ్యాలు మొత్తం 35 సెకన్ల పాటు ఆ సెల్‌ఫోన్‌లో రికార్డ్ అయ్యాయి. ఇక ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఇప్పుడు అది వైరల్ అవుతోంది. అయితే వారిద్దరి రాసలీలలను వీడియో తీస్తుండటాన్ని ఆ మహిళ చూసి డీఎస్పీకి చెప్పడంతో వారిద్దరూ సర్దుకుని బాత్రూం నుంచి బయటికి వచ్చారు.ఇక ఈ వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. కర్ణాటక రాష్ట్ర హోంశాఖ మంత్రి జి. పరమేశ్వర స్వస్థలం అయిన తుమకూరు జిల్లా పరిధిలోని మధుగిరి పట్టణం లో ఈ ఘటన జరగడం తీవ్ర ఆందోళనకు దారితీసింది. అయితే ఆ వీడియో వైరల్ అయిన తర్వాత నుంచి ఆ డీఎస్పీ రామచంద్రప్ప కనిపించకుండా పోయినట్లు సమాచారం. అయితే ఈ పరిణామంపై పోలీసు శాఖ ఇంకా అధికారికంగా ప్రకటన విడుదల చేయలేదు. ఇక ఆ డీఎస్పీపై సదరు మహిళ ఫిర్యాదు చేసిందో లేదో ఇంకా తెలియరాలేదు. ఈ కేసులో ఉన్నతాధికారులు ఇచ్చే ఆదేశాల కోసం పోలీసులు ఎదురుచూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: