వివి వినాయక్ పేరు వెనుక అసలు కథ ఇదే !

Vimalatha
కామెడీతోనే అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే దర్శకుడు వివి వినాయక్. కామెడీ కి అన్ని అంశాలను మిళితం చేసి కడుపుబ్బా నవ్విస్తూనే సినిమాను ముందుకు తీసుకెళ్తారు ఆయన. ఈరోజు వీవీ వినాయక్ పుట్టినరోజు.

 
చిన్నప్పుడు వివి వినాయక్ ను ముద్దుగా వినయ్ అని పిలుచుకునే వారట. అయితే ఆయన పేరు ముందు వివి అని ఎందుకు ఉందో చాలా మందికి తెలియదు. అయితే దానికి కారణం వేరే ఉంది. వినాయక అసలు పేరు చాలా మందికి తెలియదు. ఆయన పూర్తి పేరు పూరు గండ్రోతు వీర వెంకట వినాయకరావు. ముందున్న ఇంటిపేరు తీసేసి వీర వెంకట అనే రెండు పదాల్లోని వివిని తీసుకొని షార్ట్కట్లో వి.వి.వినాయక్ అని పెట్టుకున్నారు. చిత్రసీమలో ఎదగాలని అభిలాషతో ఇండస్ట్రీకి వచ్చిన వినాయక్ ముందుగా కొంతమందికి అసోసియేట్ గా పని చేశారు. ఆ తర్వాత దర్శకుడు సాగర్ రూపొందించిన సినిమాలకు కో-డైరెక్టర్ గా పని చేశారు.

అప్పట్లో సమరసింహా రెడ్డి ప్రేక్షకులను ఓ ఊపు ఊపేసింది. ఫ్యాక్షన్ గ్రామాలకు అద్భుతమైన క్రేజ్ ఉండేది. దాంతో వినాయక్ కూడా అదే బాటలో సాగుతూ తొలి ప్రయత్నంలోనే ఆది అనే ఫ్యాక్షన్ డ్రామాను తెరకెక్కించారు. తారక్ హీరోగా నటించిన ఈ సినిమా అనూహ్యమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఆలస్యం చేయకుండా ఆ వెంటనే నందమూరి బాలకృష్ణ తో చెన్నకేశవరెడ్డి రూపొందించారు. అయితే అప్పటికే బాలకృష్ణ లో తెరపై ఫ్యాక్షనిజం చూసిన ప్రేక్షకులకు పెద్దగా రుచించలేదు. దీంతో తన మూడో ప్రయత్నంగా అనే కాలేజీ స్టూడెంట్స్ తో మంచి లవ్ అండ్ యాక్షన్ డ్రామా ను అందించారు. ఈ సినిమా ఎలాంటి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆ సినిమాని తన ఇంటి పేరుగా మార్చుకొని ప్రస్తుతం దిల్ రాజు స్టార్ ప్రొడ్యూసర్ గా చలామణి అవుతున్నారు. ఆ తర్వాత ఠాగూర్, సాంబ, అదుర్స్, కృష్ణ, లక్ష్మి, నాయక్, బన్నీ, బద్రీనాథ్ యోగి, ఇంటిలిజెంట్, అల్లుడు శీను, అఖిల్ వంటి సినిమాలతో ముందుకు నడిచారు. 'ఖైదీ నెంబర్ 150'తో మెగా అభిమానుల్లో ఉత్సాహం నింపిన ఆయన ప్రస్తుతం "ఢీ అంటే ఢీ" అనే సినిమాను చేస్తున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: