బర్త్ డే : నాగ్ తో అమల లవ్ స్టోరీ ఎలా మొదలైందో తెలుసా ?

Vimalatha
సీనియర్ నటి అమల అక్కినేని ఈ రోజు తన 54 వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. అమల 12 సెప్టెంబర్ 1967 న కోల్‌కతాలో జన్మించింది. అమల టాలీవుడ్ కింగ్ నాగార్జునను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. నాగార్జున అమలను వివాహం చేసుకున్నప్పుడు ఆమె తన కెరీర్‌లో పీక్స్ లో ఉంది. పెళ్లి తరువాత సినిమా కెరీర్ ను వదిలేసి కుటుంబమే లోకంగా బ్రతుకుతున్న ఉత్తమ ఇల్లాలు. అలాగే తన జంతు ప్రేమతో చేస్తున్న సేవ, ఎంతో మందికి ఆమె స్ఫూర్తి దాయకం. ఇక నాగ్, అమల ప్రేమ కథ చాలా మధురంగా, ఆహ్లాదంగా అన్పిస్తుంది. ఈ ప్రేమ కథ సినిమా కథ కంటే తక్కువేం కాదు మరి. ఈ రోజు అమల పుట్టినరోజు సందర్భంగా అమల, నాగార్జున ప్రేమ కథ గురించి తెలుసుకుందాం.
ప్రేమ కథ అలా మొదలైంది !
అమల మోడల్‌గా తన కెరీర్‌ను ప్రారంభించింది. మోడలింగ్ తర్వాత ఆమె సినిమా ప్రపంచంలోకి అడుగు పెట్టింది. నాగార్జున, అమల అనేక చిత్రాలలో కలిసి పని చేశారు. షూటింగ్ సమయంలో ఇద్దరూ ఒకరినొకరు ప్రేమించుకున్నారు. ఇద్దరూ ఎక్కువగా కలిసి గడిపేవారు. తరువాత మంచి ఫ్రెండ్స్ అయ్యారు. సమాచారం ప్రకారం ఒకసారి అమల తన చిత్రం కోసం షూటింగ్ చేస్తోంది. ఆ సమయంలో నాగార్జున ఆమెకు సర్ప్రైజ్ ఇవ్వడానికి అమల సెట్‌కి చేరుకున్నాడు. కానీ అతను అమలను కలిసినప్పుడు ఆమె ఏడుస్తోంది. ఆమె ఏడుపుకి కారణం నాగార్జున అడిగినప్పుడు, తర్వాతి సన్నివేశంలో తాను ధరించాల్సిన బట్టలు చాలా విచిత్రంగా ఉన్నాయని, వాటిని ధరించడం తనకు ఇష్టం లేదని అమల చెప్పింది. దీనిపై నాగార్జున డైరెక్టర్‌తో మాట్లాడతానని చెప్పాడు. ఆ తర్వాత నాగార్జున దర్శకుడితో మాట్లాడి ఆమె బట్టలను మార్పించాడు. నాగార్జున ప్రవర్తన అమలను బాగా ఆకట్టుకుందట. ఇంకేముంది ఆమె మనసులో అతనిపై ప్రేమ కూడా మొదలైంది. ఆ సమయంలో వారి సంబంధం గురించి చాలా రూమర్స్ వచ్చాయి. కానీ వారిద్దరూ వాటిపై స్పందించలేదు.
విదేశాలలో లవ్ ప్రపోజల్
అమల, నాగార్జున సినిమా షూటింగ్ కోసం విదేశాలకు వెళ్లారు. మన మన్మథుడు అమలకు చాలా ప్రత్యేకంగా లవ్ ప్రొపోజల్ చేశాడట. ఆ తర్వాత నాగార్జున తన మొదటి భార్యకు విడాకులు ఇచ్చాడు. 1992 లో నాగార్జున, అమల వివాహం చేసుకున్నారు. కుటుంబ సభ్యులు, స్నేహితులు మాత్రమే ఈ వివాహానికి హాజరయ్యారు. అమల, నాగార్జునలకు అఖిల్ అనే కుమారుడు ఉన్నాడు. అఖిల్ కూడా తన తండ్రిలాగే  వెండితెరపై రాణించడానికి ప్రయత్నిస్తున్నాడు. .

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: