"ఆజాద్ హిందూ ఫౌజ్" వ్యవస్థాపకుడు నేతాజీ జయంతి నేడు

Malathiputhra
దేశ స్వాతంత్రం కొసం  పోరాటం చేసిన యోదులలో నేతాజీ సుభాష్ చంద్ర బోస్ ఒకరు.. స్వాతంత్ర పోరాటం లో భాగంగా గాంధీజీ చేపట్టిన అహింసా మార్గంలోనే కాకుండా సాయుధ పోరాటం ద్వారా ఆంగ్లేయులను దేశం నుంచి తరిమి కొట్టవచ్చునని బలంగా నమివారిలో ప్రథములు  సుభాష్ చంద్రబోస్ అయన జయంతి నేడు ..
అయన జ‌యంతిని ‌భార‌త ప్ర‌భుత్వం ఈ సంవత్సరం నుంచి ప‌రాక్ర‌మ్ దివ‌స్‌గా జ‌ర‌పాల‌ని నిర్ణ‌యించింది.. ఇందులో భాగంగా నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ 125వ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ కోల్‌కతాలో నిర్వహించిన ఉత్సవాల్లో పాల్గొన్నారు. విక్టోరియా మోమోరియల్‌ను సందర్శించారు. ఆయనకు ఘనంగా నివాళి అర్పించారు.  
ఇక చదువు ముగిసిన అనంతరం భారతీయ స్వాతంత్ర ఉద్యమానికి జీవితాన్ని అంకితం చేసారు.. గాంధీజీ చేపట్టిన అనేక ఉద్యమాలలో పాల్గొన్నారు ఆ తర్వాత రెండుసార్లు భారత జాతీయ కాంగ్రెస్‌ కు అధ్యక్షుడిగా ఎన్నికైనా గాంధీజీ అహింస సిద్ధాంతాన్ని విభేదించి ఆ పదవికి రాజీనామా చేశారు. దేశానికి స్వాతంత్రం రావాలంటే ఒక్క వహింస మర్మాజీ సరిపోదని ఆంగ్లేయుల పోలీసులను అడ్డుకునేందుకు ఒక సైన్యం కావాలని భావించి  ఆంగ్లేయుల పైకి  పోరుబాట కూడా ముఖ్యమని నమ్మి... ఆ నమ్మకమే నేతాజీ ఆజాద్ హిందూ ఫౌజ్‌ స్థాపనకు మూలం చేసింది.. అయన స్థాపించిన ఇండియన్ నేషనల్ ఆర్మీతో ఆంగ్లేయులని తరిమికొట్టడంలో కొంతమేర సక్సెస్ అయ్యారు.. ఇండియన్ నేషనల్ ఆర్మీ దేశానికి స్వాతంత్రం రావడం లో తన వంతు పాత్రని పోషించింది అనడం లో ఎటువంటి సందేహం లేదు.. అయితే దేశానికి ఇంత సేవ చేసిన నేతాజీ సుభాష్ చంద్ర బోస్ మరణం పై అనేక అనుమానాలు ఉన్నాయి.. తైవాన్ లో జరిగిన ఓ విమాన ప్రమాదం లో ఆయన మరణించినట్లు అందరు భావించినప్పటికీ.. అయన మరణం పై సరైన క్లారిటీ లేదు.. ఇక స్వాతంత్ర్య పోరాటంలో భాగంగా అనేక సార్లు జైలుకు కూడా వెళ్లిన నేతాజీ.. ఆంగ్లేయుల నుంచి భారతదేశాన్ని రక్షించేందుకు చలో ఢిల్లీ నినాదాన్ని ఇచ్చారు. తన సైన్యం ద్వారానే ఆంగ్లేయులకు ముచ్చెమటలు పట్టించి చివరికి దేశానికి స్వాతంత్రం తేవడంలో నేతాజీ  ప్రముఖ పాత్ర పోషించారు ..  
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: