హెరాల్డ్ బర్త్ డే : 04-06-2020 రోజున జన్మించిన ప్రముఖులు..?

praveen

జూన్ 4వ తేదీన ఒక సారి చరిత్రలోకి వెళితే ఎంతో మంది ప్రముఖుల జననాలు జరిగాయి. మరి ఒక్కసారి చరిత్ర పుటల్లోకి వెళ్లి నేడు జన్మించిన ప్రముఖులు ఎవరు తెలుసుకుందాం రండి. 

 

 ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం జననం  : తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన నేపథ్య గాయకుడు సంగీత దర్శకుడు నటుడు ఆయన ఎస్పీ బాలసుబ్రమణ్యం తెలుగు ప్రేక్షకులందరికీ సుపరిచితులే. ఈయన  1946 జూన్ 4వ తేదీన అప్పటి పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో జన్మించారు. మద్రాస్ లో చదువుకుంటున్న సమయంలో బాలసుబ్రహ్మణ్యం చలన చిత్ర రంగ ప్రవేశం చేశారు... 1966లో పద్మనాభం నిర్మించిన శ్రీ శ్రీ మర్యాద రామన్న చిత్రంతో సినీ గాయకునిగా పరిచయం అయ్యారు ఎస్పీ బాలసుబ్రమణ్యం. ఈ సినిమాకు ఎస్.పి.కోదండపాణి సంగీత దర్శకుడిగా వ్యవహరించారు. పాటలోనే మాటలని గళంలో అభినయ ముద్రలను నింపి తెలుగుదనం వొలికించగల  విలక్షన  గాత్రం బాలు  సొంతమని చెప్పవచ్చు. తెలుగు చిత్ర పరిశ్రమలో సింగర్గా ఎన్నో పాటలు పాడి ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. కేవలం తెలుగులోనే కాకుండా హిందీ సినిమాలకు కూడా పాటలు పాడారు ఎస్పీ బాలసుబ్రమణ్యం. 40 ఏళ్ల ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం సినీ ప్రస్థానంలో 40 వేల పాటలు 14 భాషలలో పాడి ఎన్నో  జాతీయ పురస్కారాన్ని కూడా అందుకున్నారు ఎస్పీ బాలసుబ్రమణ్యం. అందుకే ఆయనను భారత దేశం గర్వించదగ్గ గాయకుడు అని అంటూ ఉంటారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చే నంది పురస్కారాలను కూడా 29 సార్లు అందుకున్నారు. 2001లో గాయకుడిగా ఆయన చేసిన సేవలకు గాను పద్మశ్రీ పురస్కారం కూడా లభించింది. ఆ తర్వాత పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ కూడా అందుకున్నారు. పద్మభూషణ్ పురస్కారాన్ని కూడా అందుకున్నాడు ఎస్పీ బాలసుబ్రమణ్యం. 

 


 ప్రియమణి జననం : దక్షిణాది చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ నటి ప్రియమణి 1984 జూన్ 4వ తేదీన జన్మించారు. ఈమె  తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో ఏళ్ల పాటు స్టార్ హీరోయిన్గా కొనసాగారు. ఎంతోమంది స్టార్ హీరోలతో ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించారు ప్రియమణి. అటు తమిళ చిత్ర పరిశ్రమలో కూడా ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించారు. తమిళంలో పరుత్తివీరన్ సినిమాలో  ప్రియమని తన నటనకు గాను జాతీయ ఉత్తమ నటి పురస్కారాన్ని కూడా అందుకున్నారు. తెలుగు తమిళ కన్నడ మలయాళ భాషల్లో దాదాపు 20 చిత్రాల్లో నటించి... అటు బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో కూడా అడుగుపెట్టారు ప్రియమణి. ఇక తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రియమణికి ఎంతో మంది అభిమానులు ఉన్నారు. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్న ప్రియమణి అక్కడక్కడా వెబ్ సిరీస్ లో మాత్రం తన నటనతో ఆకట్టుకుంది. అదే సమయంలో బుల్లితెరపై పలు  ప్రోగ్రాం లో కనిపిస్తు బుల్లితెర ప్రేక్షకులకు కూడా దగ్గర అవుతుంది. 

 

 వేణు జననం  : తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి వేణు  1986 జూన్ 4వ తేదీన జన్మించారు. ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో వేణు అంతగా ఎక్కడా కనిపించకపోయినప్పటికీ... అప్పట్లో మంచి గుర్తింపు ఉండేది. వరుస సినిమాలతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చి  అలరించాడు. స్వయంవరం అనే సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలో తన సినీ ప్రస్థానం ప్రారంభించాడు వేణు. తర్వాత ఎన్నో సినిమాల్లో కూడా నటించారు. మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకొన్న  వేణు... ఆ తర్వాత ఎన్నో అవకాశాలను చేజిక్కించుకున్నారు. ప్రస్తుతం అవకాశాలు కరువవడంతో తెలుగు తెరపై ఎక్కడా కనిపించకుండా పోయారు. కానీ అప్పుడప్పుడు పలు ముఖ్య పాత్రల్లో స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తూ ఉంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: