బ్యూటీ ప్రొడక్ట్స్ కొనేముందు..ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!!!

NCR

అందంగా కనపడటానికి చాలా మంది అష్టకష్టాలు పడుతూ ఉంటారు. ఈ క్రమంలోనే టీవీలలో చూపించే , మార్కెట్ లో దొరికే అడ్డమైన సౌందర్య ఉత్పత్తులు కొంటూ ఉంటారు వాటిలో కొన్ని ఉత్పత్తులు మంచిగా ఉన్నా మరికొన్ని అందం రెట్టింపు చేయడం మాట పక్కన పెడితే, ఉన్న అందం కాస్త ఊస్ట్ అయ్యిపోతుంది. లేని పోనీ కష్టాలు కావాలని డబ్బులు ఇచ్చి మరీ కొని తెచ్చుకున్నట్టు అవుతుంది.

 

అందుకే మార్కెట్ లో దొరికే బ్యూటీ ఉత్పత్తులు కొనేముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించి ఎలాంటి ఉత్పత్తులు కొనవచ్చో తెలుసుకుని మరీ తీసుకోవడం ఉత్తమం..మరి ఎలాంటి ఉత్పత్తులు కొనాలి, ఎలాంటివి కొనకూడదో ఇప్పుడు తెలుసుకుందాం..

 

 సల్ఫేట్ ఫ్రీ – అధిక శాతం సబ్బుల తయారీలో సల్ఫేట్ అనే పదార్ధాన్ని వాడుతారు. దీనివలన చర్మంపై ఉండే తేమ పొడిబారిపోతుంది. అలాగే సున్నంటగా ఉండే వెంట్రుకలు కూడా పొడిబారి అందవిహీనంగా తయారవుతాయి. అందుకే సల్ఫేట్ ఉన్న సబ్బులని సౌందర్య సాధనాలని వాడకుండా ఉండటం మంచిది.

 

విటమిన్ సి -  సూర్య కాంతి నుంచీ చర్మాన్ని కాపాడేది విటమిన్ సి. ఇది ఎండకు దెబ్బతిన్న చర్మాన్ని కాపాడి చర్మం పాడవకుండా కాపాడుతుంది.  అందుకే విటమిన్ సి దాదాపు అన్ని సౌందర్య సాధనాలలో వాడుతారు. అందుకే విటమిన్ సి ఉన్న ఉత్పత్తులని వాడవచ్చు.

 

యాంటీ ఆక్సిడెంట్లు -  ఇవి చర్మ కణాలని  పాడవకుండా కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తాయి. చర్మానికి హాని కలిగించే ఫ్రీ రాడికల్ ఉత్పత్తిని నిలిపివేస్తాయి.అంతేకాదు చర్మాని నునుపుగా చేయడంలో కూడా సహాయపడుతాయి..ఇది ఉన్న సౌందర్య కారకాలని నిర్భయంగా వాడవచ్చు.

 

 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: