ఫ్యాషన్ దుస్తులు, యాక్ససరీస్ వాడే అందగత్తేలకి అనారోగ్య సమస్యలు తప్పవు?

Purushottham Vinay

ఫ్యాషన్ దుస్తులు, యాక్ససరీలు వాడే మహిళలకు అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తున్నాయని పరిశోధనల్లో తెలిసింది. అవేంటో తెలుసుకుందాం..మహిళలు చాలా మంది కూడా హ్యాండ్ బ్యాగ్స్‌ను ఎక్కువగా వాడుతారు. అయితే కొంతమంది మాత్రం మరీ స్టైల్‌గా కనిపించాలని చెప్పి పెద్ద హ్యాండ్ బ్యాగులను వాడుతారు. నిజానికి ఇవి అస్సలు మంచివి కావు. ఇవి భుజాలు, కండరాలు ఇంకా కీళ్ల నొప్పులను కలిగిస్తాయి. కాబట్టి ఎక్స్‌ట్రా లార్జ్ హ్యాండ్ బ్యాగులను వాడకపోవడమే మంచిది.చాలా పెన్సిల్ స్కర్ట్స్ వాడుతుంటారు. ఇవి కాళ్లను ఎప్పుడూ కూడా దగ్గరిగా ఉండేలా చేస్తాయి. అందువల్ల శరీరాన్ని బ్యాలెన్స్ చేస్తూ నడిచేందుకు కష్టపడాల్సి వస్తుంది. పైగా దీనికి తోడు బాడీ మూవ్‌మెంట్ సరిగ్గా ఉండదు. కూర్చున్నా, నిలుచున్నా చాలా కష్టతరమవుతుంది. కండరాలపై తీవ్ర ఒత్తిడి పడుతుంది. అలాగే మోకాళ్లపై భారం పడుతుంది. దీంతో ఆ ప్రదేశాల్లో నొప్పులు వస్తాయి. కాబట్టి ఇలాంటి స్కర్ట్‌లను అస్సలు వాడకూడదు.

అలాగే లావుగా ఉన్న వారు శరీరం నాజూగ్గా, స్లిమ్‌గా కనిపించేందుకు షేప్ వేర్‌ను ఎక్కువగా ధరిస్తుంటారు. ఇవి అస్సలు మంచివి కావు. ఇవి శ్వాస సమస్యలు, కండరాల నొప్పులను కలిగిస్తాయి. వీటి వల్ల శరీరంలో రక్త సరఫరాకు అడ్డంకులు ఏర్పడుతాయి. కాబట్టి వీటిని వాడకపోవడమే మంచిది.అలాగే చాలా మంది కూడా తమ ఇండ్లలో తిరిగేందుకు ఫ్లిప్ ఫ్లాప్స్‌ను  వేసుకుంటారు. అయితే ఇవి కాళ్ళకి చాలా కమ్‌ఫర్ట్‌గా ఉన్నప్పటికీ వీటి వల్ల పాదాలపై ఒత్తిడి పడుతుంది. దాని ఫలితంగా అక్కడి నుంచి వెన్నెముకకు ఉండే నరాలపై భారం పడి వెన్ను నొప్పి సమస్య వస్తుంది.నేటి కాలంలో చాలా మంది మహిళలు బ్రాలను అసలు సరిగ్గా సైజ్ చూడకుండానే వాడుతున్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి. దీంతో వారికి బ్యాక్ పెయిన్‌, భుజాలు ఇంకా వెన్నెముక నొప్పి వంటి సమస్యలు వస్తున్నాయట. కాబట్టి ఇలాంటి మహిళలు బ్రాలను వాడేముందు వాటి సైజ్ సరిగ్గా చూసుకోవడం మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: