ఈ రోజుల్లో చాలా మంది కూడా తెల్లజుట్టు సమస్యతో ఎంతగానో బాధపడుతూ ఉంటారు. పూర్వకాలంలో కేవలం పెద్ద వారిలోనే కనిపించే ఈ సమస్య ఈ కాలంలో చిన్న వయసు వారిలో కూడా ఎక్కువగా కనిపిస్తుంది.కారణాలు ఏమైనా కూడా ఈ సమస్య నుండి బయటపడడానికి చాలా రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాము. మార్కెట్ లో లభించే హెయిర్ డైలను ఎక్కువగా కొనుగోలు చేసి జుట్టుకు రంగు వేస్తూ ఉంటాము. అయితే ఈ హెయిర్ డై లను వాడడం వల్ల జుట్టు నల్లగా మారినప్పటికి వీటిని వాడడం వల్ల మనం చాలా రకాల సైడ్ ఎఫెక్ట్స్ ఎదుర్కోవాల్సి వస్తుంది. హెయిర్ డైలలో చాలా రకాల కెమికల్స్ వాడుతూ ఉంటారు.వీటిని ఎక్కువగా వాడడం వల్ల జుట్టు రాలడం, జుట్టు బలహీనపడడం ఇంకా తలలో దురద వంటి చాలా రకాల సమస్యలు తలెత్తుతాయి. అయితే హెయిర్ డైలకు బదులుగా కొన్ని రకాల సహజ సిద్ద పదార్థాలను వాడి మనం చాలా సులభంగా జుట్టును నల్లగా, ఒత్తుగా, ఆరోగ్యంగా పెరిగేలా చేసుకోవచ్చు. జుట్టును నల్లగా మార్చే సహజ సిద్ద చిట్కాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఇక ఈ చిట్కాను తయారు చేసుకోవడానికి గానూ బీట్ రూట్ ను తీసుకుని ముక్కలుగా కట్ చేసుకోని ఆ తరువాత ఈ ముక్కలను జార్ లో వేసి పేస్ట్ లాగా చేసుకోవాలి. ఆ తరువాత ఈ పేస్ట్ లో ఒక స్పూన్ తేనె, స్పూన్ కొబ్బరి నూనె కలపాలి. ఈ మిశ్రమాన్ని తలకు బాగా పట్టించి ఒక గంట తరువాత రసాయనాలు తక్కువగా ఉండే షాంపుతో శుభ్రంగా తలస్నానం చేయాలి.ఇలా చేయడం వల్ల జుట్టు సులభంగా నల్లగా మారడంతో పాటు ఒత్తుగా ఇంకా ఆరోగ్యంగా కూడా పెరుగుతుంది. ఇంకా అలాగే కాఫీ పౌడర్ ను ఉపయోగించి కూడా మనం నల్లగా మెరిసేలా చేసుకోవచ్చు. దీని కోసం అర కప్పు కాఫీ డికాషన్ లో అర కప్పు హెయిర్ కండీషనర్ వేసి బాగా కలపాలి. ఆ తరువాత దీంట్లో అర టీ స్పూన్ కాఫీ పొడిని వేసి కలపాలి. తరువాత ఈ మిశ్రమాన్ని జుట్టుకు బాగా పట్టించి ఆరిన తరువాత చల్లటి నీటితో బాగా శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల జుట్టు మంచి నల్లటి నిగారింపును సొంతం చేసుకుంటుంది. ఇంకా అలాగే అర కప్పు దాల్చిన చెక్క పొడిలో అరకప్పు కండిషనర్ వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని తలకు బాగా పట్టించి అది ఆరిన తరువాత శుభ్రంగా తలస్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల జుట్టు నల్లగా మారడంతో పాటు జుట్టు బాగా మెరుస్తుంది.