ఈ ఆయిల్ రాస్తే జుట్టు ఆగకుండా పెరుగుతుంది?

Purushottham Vinay
ప్రస్తుతం చాలా మంది కూడా చాలా రకాల జుట్టు సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఇందుకు చాలా కారణాలు ఉంటున్నాయి. కాలుష్యం, అలర్జీలు, నీళ్లు, పోషకాహార లోపం ఇంకా థైరాయిడ్ వంటి వ్యాధులు ఉండడం వంటి చాలా కారణాల వల్ల జుట్టు రాలడం, చుండ్రు వంటి సమస్యల బారిన పడుతున్నారు.అయితే చాలా మంది కూడా పోషణ సరిగ్గా అందకపోవడం వల్లే ఈ సమస్యలను ఎదుర్కొంటున్నారు. కానీ సరైన పోషణ లభిస్తే జుట్టు చాలా బాగా పెరుగుతుంది. ఇందుకు ఏం చేయాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం.జుట్టు కుదుళ్లను దృఢంగా చేసి జుట్టును బాగా పెరిగేలా చేయడంలో మనకు కెరాటిన్ అనే ప్రోటీన్ చాలా బాగా ఉపయోగపడుతుంది. అయితే జుట్టుకు కెరాటిన్ అందేలా చూసుకుంటే చాలు.. దీంతో జుట్టు రాలడాన్ని తగ్గించవచ్చు.అందువల్ల జుట్టు  పెరుగుతుంది. మరి కెరాటిన్ అందాలంటే  అందుకు జింజర్ ఆయిల్ బాగా ఉపయోగపడుతుందని చెప్పవచ్చు. దీంతో జుట్టుకు ఎక్కువ మోతాదులో కెరాటిన్ లభిస్తుంది. ఇది జుట్టుకు మంచి పోషణను అందిస్తుంది.



దీంతో జుట్టు కుదుళ్లు చాలా బలంగా మారుతాయి. జుట్టు రాలడం కూడా తగ్గుతుంది. ఇంకా జుట్టు పొడవుగా పెరుగుతుంది.జింజర్ ఆయిల్‌ను కొద్దిగా తీసుకుని అందులో కాస్త కొబ్బరినూనెని కలిపి జుట్టు కుదుళ్లకు తగిలేలా బాగా పట్టించాలి. ఆ తరువాత 30 నిమిషాలు ఆగి తలస్నానం చేయాలి. ఇలా వారంలో కనీసం మీరు 2 సార్లు చేయాలి.దీంతో జింజర్ ఆయిల్ జుట్టు పెరుగుదలకు బాగా ఉపయోగపడుతుంది.మీ జుట్టుకు పోషణను అందిస్తుంది.దీంతోపాటు పలు ఆహారాలను కూడా తీసుకోవాలి. పుచ్చ గింజలు, పప్పులు, వేరుశనగలు, సోయా, పనీర్‌, బాదంపప్పు, జీడిపప్పు ఇంకా అలాగే వాల్ నట్స్‌.. ఇలా పలు ఆహారాలను తీసుకోవడం వల్ల కూడా ఈజీగా పలు పోషకాలు లభిస్తాయి. ఇవి జుట్టు సమస్యలను తగ్గించడంలో చాలా బాగా సహాయపడతాయి. కనుక ఈ టిప్స్ పాటించడం వల్ల జుట్టు సమస్యలు లేకుండా చూసుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: