పెరుగుతో ఇలా చేస్తే మెరిసిపోవడం ఖాయం?

Purushottham Vinay
అసలు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవే లేకుండా కేవలం మనం ఆహారంగా తీసుకునే పెరుగును ఉపయోగించి ముఖ సౌందర్యాన్ని ఇంకా అలాగే చర్మ సౌందర్యాన్ని చాలా మెరుగుపరుచుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. పెరుగును వాడటం వల్ల మొటిమలు, మచ్చలు వంటి సమస్యలు తగ్గి చర్మం మృదువుగా ఇంకా అలాగే చాలా కాంతివంతంగా తయారవుతుందని సౌందర్య నిపుణులు పరిశోధనల ద్వారా తెలియజేసారు. అలాగే ఈ పెరుగులో లాక్టిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటుంది. ఇది చర్మంలో ఇన్ ప్లామేషన్ ను తగ్గించి చర్మ సమస్యలను దూరం చేయడంలో చాలా బాగా సహాయపడుతుంది.అందుకే వివిధ రకాల చర్మ సమస్యలతో బాధపడే వారు ఈ పెరుగును ఉపయోగించడం వల్ల ఖచ్చితంగా చాలా చక్కటి ఫలితాలను పొందవచ్చు. ఇంకా ఈ పెరుగులో గోధుమపిండిని కలిపి ముఖానికి మాస్క్ లా వేసుకోవాలి.ఇది పూర్తిగా ఆరిన తరువాత నీటితో బాగా శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండు సార్లు చేయడం వల్ల చర్మ సమస్యలు చాలా ఈజీగా తగ్గుతాయి.ఇంకా అలాగే మీ చర్మం పొడిబారడం కూడా తగ్గి చర్మం మృదువుగా ఇంకా తెల్లగా కూడా మారుతుంది.


అలాగే పెరుగులో పసుపును కలిపి ముఖానికి రాసుకోని ఆరిన తరువాత శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మొటిమలు ఇంకా మచ్చలు ఈజీగా తగ్గుతాయి. అలాగే పెరుగు, దోసకాయను కలిపి ముఖానికి ప్యాక్ లా వేసుకోవాలి. అది ఆరిన తరువాత శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మం పొడిబారడం ఈజీగా తగ్గుతుంది. చర్మం అందంగా తయారవుతుంది. ఇంకా అలాగే పెరుగులో టమాట గుజ్జును కలిపి కూడా ముఖానికి రాసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల కూడా ఖచ్చితంగా చాలా మంచి ఫలితాలను సొంతం చేసుకోవచ్చు. అలాగే పెరుగులో నిమ్మరసం కలిపి చర్మానికి రాసుకోని అది ఆరిన తరువాత బాగా శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మం నుండి జిడ్డు కారడం చాలా ఈజీగా తగ్గుతుంది. ఈ విధంగా పెరుగును వాడడం వల్ల చర్మ సంబంధిత సమస్యలన్నీ చాలా ఈజీగా తగ్గుతాయి. మొటిమలు, మచ్చలు ఇంకా నలుపుదనం తగ్గి చర్మం రంగు బాగా మెరుగుపడుతుంది. చర్మ సంబంధిత సమస్యలతో బాధపడే వారు ఈ విధంగా పెరుగును ఉపయోగించడం వల్ల ఖచ్చితంగా చాలా మంచి ఫలితం ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: