వెల్లుల్లితో ఇలా చేస్తే మొటిమలు మాయం!

Purushottham Vinay
మొటిమలను తొలగించటంలో వెల్లుల్లి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఇంకా వెల్లుల్లితో ఎలాంటి ప్యాక్స్‌ వేసుకోవచ్చో ఇప్పుడు చూద్దామా..ఇక వెల్లుల్లిని చిదిమి దాని నుండి రసాన్ని వేరు చేసి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. వెల్లుల్లి రసంలో తాజా కలబంద గుజ్జును వేసి కలపండి. ఆ మిశ్రమాన్ని మొటిమలు ఉన్న ప్రాంతంలో బాగా రాయాలి.ఒక 20 నిమిషాల పాటు అలాగే ఉంచి అనంతరం గోరు వెచ్చని నీటితో ముఖాన్ని కడుక్కోవాలి. ఇలా చేస్తే మొటిమలు చాలా ఈజీగా తొలగిపోతాయి.వెల్లుల్లి రెబ్బలను మిక్స్‌ చేసి అందులో వెనిగర్‌ కలిపి పేస్టులా వచ్చే వరకు బాగా కలపాలి. ఇక ఈ మిశ్రమాన్ని మొటిమలు ఉన్న చోట కాటన్‌ బాల్‌తో రాయాలి. అది పూర్తిగా ఆరిపోయిన తర్వాత ముఖాన్ని నీటితో బాగా శుభ్రం చేసుకోవాలి. తరుచూ ఇలా చేస్తే ముఖం చాలా కాంతివంతంగా మారుతుంది.అలాగే ఎగ్‌ వైట్‌ తీసుకోండి.. దానికి ఈ వెల్లుల్లి పేస్ట్ కలిపి  మిశ్రమం చేసుకోండి. ఇక ముఖానికి అప్లై చేసి 20 నిమిషాల తరువాత గోరు వెచ్చని నీటితో కడుక్కోవాలి. ఇలా చేయటం వల్ల చర్మం మీద మృతకణాలు చాలా ఈజీగా తొలగిపోతాయి.


జుట్టుకు కూడా వెల్లుల్లి చాలా మేలు చేస్తుంది.. ఇక జుట్టు ఊడడానికి ప్రధాన కారణం బలహీనమైన చిగుళ్ళు. దీనికి ఆదిలోనే చెక్ పెట్టాలంటే కొబ్బరి నూనె ఇంకా వెల్లుల్లి మిశ్రమాన్ని వేసి చేసి తలకు మసాజ్ చేసుకోవాలి. ఇలా వారానికి ఒకటి రెండు సార్లు చేసి తలస్నానం చేయటం వల్ల జుట్టు రాలటం వెంటనే ఆగిపోతుంది. అంతేకాకుండా వెల్లుల్లి ఉండే ఐరన్ ఇంకా మినరల్స్ జుట్టును పొడవుగా పెంచేందుకు తోడ్పడతాయి. వెల్లుల్లిలో ఉండే విటమిన్ సి కండరాలూ, చర్మం ఇంకా అలాగే ఆరోగ్యానికి అవసరమయ్యే కొల్లాజెన్‌ను కూడా ఉత్పత్తి చేస్తుంది.కాబట్టి.. ముఖంపై మొటిమలు తొలగించుకునేందుకు ఆఖరి ప్రయత్నంగా ఈ వెల్లుల్లి చిట్కాలను ఖచ్చితంగా ట్రై చేయండి..! కొందరికి పెద్దగా పింపుల్స్‌ అనేవి ఉండవు.. కానీ చాలామందికి ఉంటాయి. ముఖం అంతా కూడా పింపుల్స్‌ వచ్చేస్తాయి. వాళ్లు చాలా క్రీమ్స్‌ వాడినప్పటికీ ఆశించినంత ఎలాంటి ఫలితం ఉండదు. ఇలాంటి హెల్తీ హోమ్‌ రెమెడీస్‌ వల్లే సమస్య పూర్తిగా నయమవుతుంది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: