ఈ సూపర్ పౌడర్ తో మీ జుట్టు కి డబుల్ బెనిఫిట్..!!

Divya
సాధారణంగా బలమైన , ఒత్తైన , పొడవైన జుట్టు కావాలని కోరుకునే అమ్మాయిలు చాలామందే ఉంటారు అని చెప్పవచ్చు. ఇక ఇందులో ఉండే ఔషధ గుణాలు జుట్టుకు లోపల నుంచి మంచి పోషణను కూడా అందిస్తాయి.. నిజానికి జుట్టు సంరక్షణ అనేది మనం అనుకున్న దాని కంటే కొంచెం కష్టంగా ఉంటుంది. ఇకపోతే పొడవాటి జుట్టు ఉన్నవారు ఇక జుట్టు పైన ఎక్కువ శ్రద్ధ పెట్టవలసి ఉంటుంది. ఇకపోతే జుట్టు చిట్లి పోవడం , పలచబడడం , రాలిపోవడం, చుండ్రు వంటి సమస్యలతో.. ఉన్న జుట్టును కూడా కోల్పోవాల్సి వస్తుంది. ఇకపోతే చాలామందికి చిన్న వయసులోనే తమ జుట్టు బూడిద రంగును కలిగి ఉంటుంది. అయితే ఈ జుట్టును నల్లగా మార్చడానికి చాలామంది రసాయనాలు కలిగిన రంగులను ఉపయోగిస్తారు. ఫలితంగా జుట్టుకు మరింత నష్టం కలిగే అవకాశం ఉంటుందని సౌందర్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
మీరు నేచురల్ గా మీ జుట్టు ని ఒత్తుగా మార్చుకోవడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి. ముఖ్యంగా వాటిలో ఇండిగో పౌడర్ గురించి తెలుసుకుందాం.. అదే ఇండిగో పౌడర్.. ఇది నీలిమందు అనే  ఔషధ గుణాలు కలిగిన చెట్టు ఆకుల నుంచి ఈ పొడిని తయారుచేస్తారు. ఇందులో హానికరమైన అమోనియా, పీ పీ డీ వంటి రసాయనాలు ఏమీ ఉండవు. అందుకే ఈ పొడిని జుట్టుకు పట్టించడం వల్ల జుట్టు కూడా నల్లబడుతుంది. రసాయనాలు లేని ఈ పొడిని జుట్టుకు ఉపయోగించడం వల్ల ఎలాంటి నష్టం కూడా జరగదు. అయితే దీనిని ఉపయోగించడం వల్ల మన జుట్టుకు కలిగే ప్రయోజనాలేంటో ఒక సారి చదివి తెలుసుకుందాం..

అయితే ఈ ఇండిగో పౌడర్ ను ఉపయోగించడం వల్ల జుట్టు రాలడం ఆగిపోతుంది.. అంతేకాదు జుట్టు పెరుగుదల కూడా ఎక్కువగా ఉంటుంది. స్కాల్ఫ్ మీద వచ్చే చుండ్రును తొలగించడానికి మురికి, దుమ్మును కూడా తొలగించే అంత శక్తి ఈ ఇండిగో పౌడర్ కి ఉంది. ఇక జట్టుకు  కండీషనర్ లాగా కూడా పనిచేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: