జుట్టు ఎక్కువగా రాలుతుందా? అయితే ఈ టిప్స్ పాటించండి..

Purushottham Vinay
చాలా మందికి కూడా జుట్టు ఎక్కువగా రాలిపోతూ ఉంటుంది. ఇక అలా రాలిపోకుండా ఉండాలంటే ప్రతిరోజూ కూడా మీరు పడుకునే ముందు మీ జుట్టును బాగా దువ్వటం చెయ్యాలి.ఇక ఈ సందర్భంలో మీరు ఎలా దువ్వాలంటే ఒక పెద్ద పంటి దువ్వెన ఉపయోగించి మీ జుట్టులోని అన్ని ముడులను మెల్లగా విప్పాలి. ఇక జుట్టును దువ్వేటప్పుడు పెద్ద పంటి దువ్వెనతో దువ్వడం వల్ల మీ జుట్టు అసలు దెబ్బతినదు.ఇక ఇది మీ జుట్టును ఎంతో మృదువుగా చేస్తుంది. ఇంకా మీ జుట్టు చిక్కులను కూడా చాలా సులభంగా వదిలివేస్తుంది.ఒకవేళ మీకు పెద్ద జుట్టు కనుక ఉంటే మీరు రాత్రి పూట పడుకునే ముందు మీరు తప్పనిసరిగా దానిని అల్లిన తర్వాతనే పడుకోవాలి. ఇక రాత్రిపూట అల్లికలతో నిద్రపోవడం వల్ల బెడ్‌లో జుట్టు రాపిడి అనేది తొందరగా తగ్గుతుంది.ఇక దీని ఫలితంగా మీ జుట్టు చాలా తక్కువగా దెబ్బతింటుంది.ఇక అంతేకాకుండా మీ నిద్రలో జుట్టు కళ్ళు ఇంకా ముఖానికి కూడా ఇది దూరంగా ఉంటుంది.

ఇక అలాగే ఖచ్చితంగా నిద్రపోయేటప్పుడు మీ జుట్టును ఎప్పుడూ కూడా అసలు గట్టిగా మాత్రం కట్టుకోకండి. ఇక మరీ మీరు గట్టిగాకనుక కట్టుకుంటే మీ జుట్టు చాలా త్వరగా విరిగిపోవడం అనేది జరుగుతుంది. దాని ఫలితంగా మీ జుట్టు సన్నగా మారుతుంది. ఇంకా జుట్టు మూలాలు కూడా చాలా బలహీనమవడం జరుగుతుంది.ఇక అలాగే మీరు బాగా నిద్రపోతున్నప్పుడు మీ జుట్టుకు కొంచెం ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలనుకుంటే ఇక ఖచ్చితంగా సిల్క్ దిండు కవర్ పడుకోడానికి ఉపయోగించండి. ఇది మీ జుట్టులో రాపిడి ధోరణిని తగ్గించడానికి ఎంతగానో సహాయపడుతుంది. అందువల్ల మీ జుట్టు తక్కువగా దెబ్బతింటుంది. ఇంకా అలాగే జుట్టు ఇక విరిగిపోవడం అనేది ఇక జరగదు. ఇక అంతేకాకుండా ఇది జుట్టు యొక్క సహజ నూనెలను కూడా అసలు గ్రహించదు. అందువల్ల మీ జుట్టు యొక్క తేమను ఇది నిలుపుకుంటుంది. అలాగే మీకు శాటిన్ లేదా సిల్క్ దిండు కవర్ కనుక లేకపోతే ఇక మీ జుట్టును రక్షించడానికి సిల్క్ స్కార్ఫ్ ని మీరు పడుకోవడానికి ఉపయోగించవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: