అందమైన ముఖంపై "మంగు" వచ్చిందా... ఇలా చేయండి?

VAMSI
చాలా మంది ముఖంపై మంగు సమస్యతో బాధపడుతుంటారు. ముఖ్యంగా ఎక్కువ మంది మహిళలు ఈ కారణంగా చాలా ఇబ్బంది పడుతుంటారు. మహిళలకు అందంపై కాస్త ప్రత్యేక శ్రద్ధ ఉండడం సహజమే. అలాంటి వారి అందమైన మోముపై మంగు వచ్చింది అంటే అది ఎంత బాధాకరంగా ఉంటుందో అనుభవించే వారికి తప్ప మరెవరికీ తెలియదు. వారి వారి ఆరోగ్య సమస్యలను బట్టి వారు వినియోగించే కొన్ని రకాల మెడిసిన్స్ ప్రభావం కారణంగా కూడా చర్మంపై నల్ల మచ్చలు, మంగు వచ్చే అవకాశాలు ఉందని చెబుతున్నారు నిపుణులు. అలాంటి వారు ఇలా ఓ సారి ట్రై చేసి చూడండి.
చేతులు కాలాక ఆకులు పట్టుకుని ఏం ప్రయోజనం అన్నట్టుగా... చర్మంపై ముందు నుండే జాగ్రత్త ఉంటే పెద్దగా సమస్యలు అలాగే నేటి ఫాస్ట్ జనరేషన్ లో చాలా మంది వారి జీవన శైలి కారణంగా మంగు అనేది వస్తుందని కొందరు నిపుణుల అభిప్రాయం. అయితే ఈ మంగును పోగొట్టు కోవడం అనేది చిన్న విషయమేమీ కాదు. చాలా మంది ఏళ్ల తరబడి ఈ మంగు సమస్యతో చాలా చింతిస్తుంటారు..అలాంటివారు SPF-30 ఉన్న సన్‌ స్క్రీన్‌ను రోజూ రాసుకోవాలని కొందరు నిపుణులు చెబుతున్నారు. బయట ఎండ వేడి ఎక్కువగా ఉన్నప్పుడు...బయట ఎక్కువగా తిరగరాదు ఒకవేళ వెళ్లాల్సి వచ్చినా ముఖాన్ని చేతులను కప్పుకోవాలి.
ముఖంపై మాస్క్ వేసుకోవడం గొడుగు పట్టడం వంటివి చేయాలి. తద్వారా మంగు వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయని చెబుతున్నారు. ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు  సమస్య ఉండే చోట కలబంద గుజ్జును బాగా పదినిమిషాల పాటు అప్లై చేసుకోవాలి. మరుసటి రోజున ఉదయాన్నే ముఖాన్ని గోరు వెచ్చటి నీటితో తరచూ శుభ్ర పరచుకోవడం వలన మంగు అలాగే నల్ల మచ్చలు సమస్య మెల్లగా మాయమవుతుంది అని చెబుతున్నారు నిపుణులు. మరి మీరు కూడా ఇదే విధంగా ట్రై చేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: