యవ్వనంలో ఉన్నారా మీ ముఖం సున్నితంగా లేదా ?

VAMSI
అమ్మాయిలకు శరీరం చాలా సున్నితంగా ఉంటుంది. అమ్మాయిలు వారి చర్మం పట్టులా తాకితే జారిపోయేలా ఉండాలని అనుకుంటారు. ముఖ్యంగా కెమెరా ముందు కనిపించే వారికి చర్మ సౌందర్యాన్ని కాపాడుకోవడం ఎంతైనా అవసరం. ఇక చాలా మంది తమ చర్మం రఫ్ గా ఉందని, పొడిబారుతోంది అని చాలా ఇబ్బంది పడుతుంటారు. వారి చర్మం ఎలాగైనా మృదువుగా వచ్చేలా చేసుకోవాలని తెగ ప్రయత్నాలు చేస్తుంటారు. కొందరయితే మార్కెట్ లోకి వచ్చే ప్రతి ఫేస్ క్రీములను వదలకుండా వాడుతుంటారు. ఒక్కటైనా వారి చర్మానికి సరిపోతుందో అన్న ప్రయోగాలు చేస్తుంటారు. కొంత మందికి ఆ క్రీములు పనిచేయక పోగా రియాక్షన్ వచ్చి దద్దుర్లు వంటివి ఏర్పడతాయి. మరి కొందరు కొద్దో గొప్పో మంచి ఫలితాన్ని పొందుతున్నారు. వీటన్నిటికీ ఎక్కడలేని ఖర్చు అయితే సహజమైన ఈ పదార్థాలను ఓ సారి మీరే ట్రై చేసి చూడండి.
ఆరోగ్యకరమైన, అందమైన చర్మానికి మాయిశ్చరైజింగ్ అనేది చాలా అవసరం. కాబట్టి చర్మం పొడి బారకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎండలో ఎక్కువగా తిరగడం మంచిది కాదు. కాస్త  టొమాటో జూస్ లో కొద్దిగా శనగ పిండి వేసుకుని ఆ పేస్ట్ ని ముఖానికి పట్టేలా సర్కిల్ షేప్ లో బాగా మసాజ్ చేసుకోవాలి. ఓ అరగంట ఆగి చల్లటి నీటితో కడుక్కోవాలి. సబ్బు వాడరాదు. ఇలా వారానికి మూడు నాలుగు సార్లు చేయొచ్చు. ఇది చర్మాన్ని మృదువుగా ఉంచి మెరిసేలా చేస్తుంది.
* నిత్యం చిరునవ్వు చిందిస్తే..మీ చర్మం మరింత ఆరోగ్య కరంగా మారుతుంది. ఇదేంటి అనుకుంటున్నారా...నవ్వడం వలన  రక్త ప్రసరణ మెరుగ్గా జరిగి మీ ముఖంపై ఉన్న  చర్మానికి  పోషకాలు, ఆక్సిజన్ అధికంగా లభించి ఆరోగ్యకరంగా చేస్తాయి. తద్వారా మీ ముఖం మెరుస్తూ ఎంతో  యవ్వనంగా కనిపిస్తుంది.
* ప్రతి రోజు నిద్రపోయే ముందు కాస్త బియ్యపు పిండిని టొమాటోతో కలిపి అలా పూసుకొని ఇలా కడిగేయండి. ఇలా చేయడం వలన చర్మ రంధ్రాల్లో చేరిన మురికి పోయి  చర్మ రంధ్రాలు బాగా గాలి అందుతుంది. దీని వలన మీ ముఖంలో గ్లో  వస్తుంది. అంతేకాదు ఫ్రెష్ గా కనిపిస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: