ఇలా చేస్తే తెల్లటి పళ్ళతో చక్కని చిరునవ్వు మీ సొంతం..

Purushottham Vinay
మనం అందంగా కనపడాలంటే కేవలం అందమైన ముఖం మాత్రమే కాదు. అందమైన ఆరోగ్యవంతమైన పళ్ళు కూడా ఉండాలి. ఎందుకంటే అందమైన చిరు నవ్వే ఒక మనిషి యొక్క అందాన్ని రెట్టింపు చేస్తుంది. చాలా మందికి కూడా పళ్ళ సమస్య ఎక్కువగా ఉంటుంది. పళ్ళు బలంగా లేక చాలా మందికి పంటి నొప్పి ఎక్కువగా ఉంటుంది. అందువల్ల నోరు దుర్వాసన వచ్చి పళ్ళు ఊడిపోవడం జరుగుతుంది. ఇక ఈ సమస్యని తగ్గించుకోవాలంటే సింపుల్ గా ఈ టిప్స్ ని ఫాలో అవ్వండి. మంచి ఫలితం అనేది ఉంటుంది.
ఇక పంటి నొప్పిని తగ్గించడానికి ఉప్పునీరు చాలా బాగా పనిచేస్తుంది. ఇందుకోసం మీరు చేయాల్సిందల్లా ఏమి లేదు.వేడినీటిలో ఉప్పుని కలుపుకొని ఆ నీటితో నోరు బాగా పుక్కిలించాలి. ఇది ఒక చక్కని సహజ క్రిమిసంహారిణి. అందువల్ల వెంటనే మీ పంటినొప్పి సమస్యని తగ్గిస్తుంది.
అలాగే మీ పంటి నొప్పి సమస్యని నయం చేయడానికి మరొక సులభమైన మార్గం ఏంటంటే ఐస్‌ పెట్టడం. మీకు పంటి నొప్పి అనిపించే చోట ఒక ఐస్ ప్యాక్‌తో నొక్కండి.ఎందుకంటే ఐస్ ఆ ప్రాంతాన్ని బాగా క్లీన్ చేస్తుంది. ఇక అంతేకాదు అది వెంటనే నొప్పిని కూడా తగ్గిస్తుంది.
ఇక పంటి నొప్పికి లవంగంతో చికిత్స చేయడం కూడా ఒక మంచి పద్ధతని చెప్పాలి. ఇది ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. అలాగే మీరు లవంగ నూనెను కూడా తీసి నొప్పి ప్రభావిత ఎక్కువగా ప్రాంతంలో అప్లై చేయవచ్చు. ఇది ఖచ్చితంగా మీకు పంటి నొప్పి నుంచి మంచి ఉపశమనం కలిగిస్తుంది.
అలాగే పుదీనా టీ బ్యాగులు కూడా పంటి నొప్పిని వెంటనే తగ్గిస్తాయి. గోరువెచ్చని టీ బ్యాగ్స్‌ని తీసుకొని మీకు పంటినొప్పి వున్న ప్రాంతంలో కొద్దిసేపు పెట్టాలి. ఇక వెంటనే ఇది నొప్పిని తగ్గిస్తుంది.
ఇక వెల్లుల్లిలో కూడా చక్కటి సహజ యాంటీ బాక్టీరియల్ లక్షణాలు అనేవి ఉంటాయి. వెల్లుల్లిని బాగా చూర్ణం చేసి నొప్పి ప్రభావిత ప్రాంతంలో అప్లై చేయవచ్చు లేదంటే వెల్లుల్లి ముక్కను నమలవచ్చు. ఇలా చెయ్యడం వల్ల పంటి నొప్పి ఇంకా వాపు తక్షణమే తగ్గి పళ్ళు చాలా బలంగా ఉంటాయి

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: