కాటుక ఎక్కువసేపు ఉండాలంటే ఇలా పెట్టుకోండి.

Purushottham Vinay
అమ్మాయిలు కళ్ళకు కాటుక పెట్టుకుంటే ఎంత అందంగా కనిపిస్తారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే చాలా మందికి కూడా కాటుక పెట్టుకున్నప్పుడు అది ఎక్కువ సేపు ఉండదు. ఇక అలావుండాలంటే ఇలా చెయ్యాలి.ముందుగా మీరు ఎప్పుడూ కూడా మంచి కాటుకని ఎంచుకోవాలి. ఇక ఎక్కువ సేపు కంటికి ఏ కాటుక ఉంటుందో దానినే మీరు సెలెక్ట్ చేసుకోవాలి. చాలా మంది మహిళలకు కూడా కళ్ళలోంచి నీళ్ళు ఎక్కువగా వస్తూ ఉంటాయి.అందుకే అలాంటి వాళ్ళు ఖచ్చితంగా మంచి కాటుకని సెలెక్ట్ చేసుకోవాలి.కాబట్టి మంచి నాణ్యమైన కాటుకను మీరు సెలెక్ట్ చేసుకోండి.వాటర్ లైన్ మీద పర్ఫెక్ట్ గా కాటుకని తీసుకుని అప్లై చేసుకోవడం మంచిది.ఇక ముందుగా మీ వేలుని కంటి కిందన పెట్టండి.ఇక అలాగే వాటర్ లైన్ ని మీరు నెమ్మదిగా కిందకి లాగండి.ఇక అప్పుడు కాటుకని నెమ్మదిగా మీ కంటి వాటర్ లైన్ పైన పెట్టండి. ఇలా కింద వాటర్ లైన్ పైన కాటుకని అప్లై చేయడం వల్ల పర్ఫెక్ట్ గా వస్తుంది. ఇక ఆ తర్వాత కింద నుండి కూడా కొద్దిగా పైకి మీరు కాటుకని పెట్టుకుంటూ పైకి వెళ్ళండి. అయితే మీరు ఎంత బ్రాడ్‌గా కాటుక పెట్టుకోవాలి అనుకునేది ఇక మీ ఇష్టం.

కొందరు మహిళలు అయితే లైట్‌గా కాటుకని పెట్టుకోడానికి ఇష్టపడతారు. మరి కొందరు అయితే కాస్త థిక్‌గా పెట్టుకోవడాన్ని ఇష్ట పడతారు. కాబట్టి ఎంత థిక్‌గా కాటుకను పెట్టుకోవాలి అనేది మీ ఇష్టంపై ఆధారపడి ఉంటుంది. మీకు ఎలా సూట్ అవుతుంది అనుకుంటే అలా మీరు కాటుక పెట్టుకుంటే బెస్ట్.ఇక  ఒక బ్రష్ ని తీసుకుని అందులో మీ కాటుకని జాగ్రత్తగా ఒక ఆర్డర్‌లో పెట్టండి. ఇక ఇలా చేయడం వల్ల మీకు మంచి లుక్ అనేది వస్తుంది. ఒకవేళ కనుక మీ దగ్గర బ్రష్ కనుక లేకపోయినట్లయితే మీరు ఇయర్ బడ్ కానీ లేక మీ వేలుని కానీ ఉపయోగించి సరి చేసుకోవచ్చు. ఇలా నెమ్మదిగా మీరు మీ కాటుకని అప్లై చేసి స్ప్రెడ్ చేయండి. ఇలా చేస్తే మీకు ఖచ్చితంగా మంచి లుక్ అనేది వస్తుంది.ఇక ఇప్పుడు బ్లాక్ ఐషాడోని తీసుకుని దాన్ని ఇయర్ బడ్ తో కానీ బ్రష్‌తో కానీ వేలు తో కానీ రాయండి. ఇలా ఐషాడోని పెట్టడం వల్ల ఎక్కువ సేపు మీ కాటుక అనేది ఉంటుంది.ఇక ఇప్పుడు మీ కళ్ళని మూసి అలాగే మీ కంటి రెప్పలపై కూడా లైట్ గా పెట్టండి. ఇలా చేయడం వల్ల మీ కళ్ళు అందంగా ఇంకా పెద్దగా కనబడతాయి.ఇలా మీరు పైన వాటర్ లైన్ మీద కూడా అప్లై చేస్తే చాలా అందంగా బాగుంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: