గుడ్డుపెంకుతో అలా చేస్తే మెరిసిపోవడం ఖాయం..

Purushottham Vinay
ఇక చర్మంపై మచ్చలను ఈజీగా తొలగించడానికి ఒక గుడ్డు షెల్‌ పొడిలో రెండు చెంచాల తేనెను అలాగే నిమ్మరసం వేసి బాగా కలపండి. ఇలా బాగా కలిపి ఒక చిక్కటి పేస్ట్‌లా రెడీ చేసుకోవాలి.ఇక ఈ మిశ్రమాన్ని ముఖానికి బాగా అప్లై చేసుకోవాలి. అలా ఒక 15 నిమిషాల పాటు ఉంచిన తర్వాత చల్లని నీటితో ముఖాన్ని బాగా శుభ్రం చేసుకోవాలి. ఇక ఈ ఫేస్ ప్యాక్‌ను ముఖానికి రెగ్యులర్ గా అప్లై చేయడం ద్వారా కొన్ని వారాలలో మీ ముఖం మీద గ్లో అనేది కనిపించడం ప్రారంభమవుతుంది.ఇక ఎగ్ షెల్ పొడిలో కలబందని జెల్ మిక్స్ చేసి ఒక పేస్ట్ లాగా చేసుకోండి. ఇక ఈ పేస్ట్‌ని తీసుకోని మీ ముఖం మీద బాగా అప్లై చేయండి. ఇక దానిని ఒక 10 నుంచి15 నిమిషాల పాటు అలానే ఉంచి ఆ తర్వాత చల్లటి నీటితో బాగా శుభ్రం చేసుకోవాలి. ఇక ఈ పేస్ట్‌ని క్రమం తప్పకుండా ముఖానికి ఉపయోగించడం వల్ల మీ చర్మం తేమగా బాగా ఉంటుంది.
ఇక అలాగే గుడ్డు పెంకులను ఉపయోగించి మీరు హెయిర్ మాస్క్ ని కూడా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. మీ జుట్టు ఎప్పుడు కూడా ఆరోగ్యంగా ఉండాలంటే, గుడ్డు షెల్ పౌడర్ ఇంకా పెరుగుని కలపి ఒక పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. ఇక ఆ పేస్ట్‌ని మీ జుట్టుకు బాగా అప్లై చేసుకోవాలి. ఇలా సుమారు ఒక 45 నిమిషాల పాటు అలాగే ఉంచి జుట్టును మంచినీటితో బాగా శుభ్రం చేసుకోవాలి. ఇక ఈ హెయిర్ మాస్క్ ని రెగ్యులర్ గా వేసుకోవడం ద్వారా మీ జుట్టు ఎంతో బలంగా ఇంకా మందంగా మారుతుంది. ఇక ఇదే కాకుండా, మీ చర్మం చాలా జిడ్డుగా ఉంటే, గుడ్డు షెల్ పౌడర్‌లో తెల్ల సొనను బాగా కలపి ఒక పేస్ట్‌లా తయారుచేయండి. ఇక ఈ పేస్ట్‌ని ఒక 10 నిమిషాల పాటు అలాగే ఉంచి ఆ తర్వాత మంచినీటితో ముఖాన్ని బాగా శుభ్రం చేసుకోండి.ఇలా చేస్తే చర్మం బాగా తాజాగా ఉండి కాంతివంతంగా మెరుస్తూ ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: