రేపు మీ ఇంట్లో శుభకార్యమా... అందంగా లేమని చింతిస్తున్నారా ?

VAMSI
అందం ఆకర్షిస్తుంది, అందం ఆకర్షింపచేస్తుంది. అందం మగవారు, ఆడవారు , చిన్న, పెద్ద, ముసలి వారు ఇలా అందరూ ఆసక్తి చూపించే ప్రధానమైన అంశాలలో ఒకటి. అందంగా ఉండాలని ఎవరు కోరు కోరు. ముఖ్యంగా ఏమైనా పార్టీలు, పూజలు, వేడుకలు వంటి ప్రత్యేక రోజుల్లో అయితే మరింత అందంగా కనిపించాలని, మీరు అందరిలోనూ చాలా ప్రత్యేకంగా ఎంతో అందంగానూ కనిపించాలని అనుకుంటుంటారు. అయితే ఇలాంటి వారిలో మీరు ఉన్నట్లు అయితే ఈ చిన్న చిన్న చిట్కాలు మీకోసమే. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. ఆ తర్వాత తేడాను మీరే గుర్తిస్తారు.
విశేషం ఏదైనా అందరి దృష్టిని ఆకర్షించే విధంగా మీరు కనిపించాలంటే. ముందు రోజు రాత్రి ఎటువంటి టెన్షన్లు లేకుండా ప్రశాంతంగా నిద్ర పోవాలి, అపుడే మన ముఖం వాడిపోయినట్లు కాకుండా ఫ్రెష్ గా ఉంటుంది. కళ్ళకి కాజల్ ఉంటేనే అమ్మాయిల కళ్ళకు మరింత అందం వస్తుంది. కాబట్టి కాజల్ ని వాడండి. కాకపోతే కొందరికి కాజల్ డార్క్ గా పెడితే బాగుంటే మరి కొందరికి డార్క్ అసలు సూట్ కాదు లైట్ గా ఉంటేనే కళ్ళు చాలా అందంగా కనిపిస్తాయి. కాబట్టి ఇది మీకు మీరు చెక్ చేసుకుని పెట్టుకుంటేనే మంచిది. మాములుగా అయితే పెద్ద కళ్ళు ఉన్నవాళ్లు కాజల్ కొంచం తక్కువ గానూ, చిన్న కళ్ళు ఉన్న వారు కాస్త  డార్క్ అండ్ బోల్డ్ గాను వేసుకుంటే బాగుంటుంది.
ఇకపోతే మేకప్ వీలైనంత తక్కువ గానే వేసుకోండి. ఎందుకంటే వీడియో అయితే తప్పనిసరి కానీ మేకప్ మరీ ఎక్కువ కాకుండా కాస్త తక్కువగా ఉన్నప్పుడే ఎదురుగా చూసేటపుడు బాగా కనిపిస్తారు. ఫేస్ కొంచం షైనింగ్ గా కనిపించాలంటే జ్యూస్ లు ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. ముఖ్యంగా క్యారెట్, బీట్ రూట్ లాంటి జ్యూస్ లు అవడడం మీముఖ సౌందర్యానికి ఎంతో ఉపయోగపడుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం ఈ రోజు నుండి ఈ టిప్స్ ను పాటించండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: