ఇలా చేస్తే స్లింగా అందంగా అవ్వడం ఖాయం..

Purushottham Vinay
చాలా మంది కూడా అధిక బరువు సమస్యతో తెగ బాధ పడుతూ వుంటారు. ఇక బరువు తగ్గి స్లింగా అందంగా కనపడాలంటే మీరు పెద్ద కష్టపడాల్సిన పని లేదు. సింపుల్ గా ఈ టిప్స్ పాటిస్తే చాలు కొన్ని రోజుల్లోనే లావు తగ్గి నాజుగ్గా అందంగా తయారవుతారు.

ఇక రాత్రి సమయంలో మీ మెటబాలిజం మందగించినట్లయితే పొద్దున్నే ఒకటి నుంచి రెండు గ్లాసుల గోరువెచ్చని నీరుని త్రాగాలి. ఇక మీ జీర్ణక్రియతో పాటు విషాన్ని కూడా బయటకు పంపడంలో వేడి నీరు ఎంతగానో సహాయపడుతుంది. నిజానికి వేడి నీరు శరీరంలోని కొవ్వు కణాలను బర్న్ చేయడంలో కూడా ఎంతగానో సహాయపడుతుంది. అలాగే ఇది జీర్ణవ్యవస్థను కూడా మెరుగుపరచడంలో ఎంతగానో తోడ్పడుతుంది.అంతే కాకుండా ఎక్కువ ఆకలిని దూరం చేస్తుంది.భోజనం చెయ్యడానికి 30 నిమిషాల ముందు వేడి నీరు కనుక తాగితే కొంచెం తక్కువగా తింటారు.

ఇక ఒక అధ్యయనం ప్రకారం తెలిందంటే సూర్య కిరణాలు అనేవి బరువు తగ్గడానికి ఎంతగానో సహాయపడతాయి. సూర్యకాంతిని తీసుకోవడం వల్ల శరీరంలో విటమిన్ డి బాగా పెరుగుతుంది. ఇది బాడీలో ఎముకలను బాగా బలోపేతం చేయడానికి ఎంతగానో సహాయపడుతుంది.ఫలితంగా లావు తగ్గి స్లింగా అందంగా కనపడతారు.

ఇక ప్రతిరోజూ కూడా ఉదయం పూట లేచి 20 నుంచి 25 నిమిషాల పాటు ఎక్సర్ సైజులు లేదా వర్కవుట్‌లు చేయాలి.ఇలా చేస్తే మీ జీవక్రియ అనేది పెరుగుతుంది. అలాగే మీ రోజు కూడా చాలా యాక్టీవ్ గా బాగా ప్రారంభమవుతుంది. మెరుగైన జీవక్రియ అనేది చాలా వేగంగా బరువు తగ్గడానికి ఎంతగానో సహాయపడుతుంది.ఇక కేవలం క్రమం తప్పకుండా వ్యాయామాలు చేయడం మాత్రమే కాదు బరువు తగ్గడానికి పోషకాహారం ఖచ్చితంగా తినాలి. CDC (సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్) ప్రకారం తేలిందేంటంటే.. రోజు క్రమం తప్పకుండా తినడం ద్వారా ఈజీగా బరువు తగ్గుతారని తేలింది.అందుకే మీ ఆహారంలో ఆకుపచ్చ కూరగాయలు ఇంకా పండ్లను కూడా చేర్చండి. పీచు, ఖనిజాలు, విటమిన్లు ఇంకా ప్రోటీన్లు అధికంగా ఉండే ఆహారం ఎప్పుడు తీసుకోవాలి.

ఇక చల్లటి నీటితో స్నానం చేయడం అన్ని సమయాలలో మంచిది కాదట. కానీ కొన్ని అధ్యయనాలు ప్రకారం శరీరంలో స్తంభింపచేసిన కొవ్వు కణజాలాన్ని చన్నీళ్లు సక్రియం చేస్తాయని తేలింది.పొద్దున్నే చల్లటి నీటితో స్నానం చేయడం వల్ల శరీరంలోని కొవ్వు కరుగుతుందని జీవక్రియ రేటు పెరుగుతుందని అనేక అధ్యయనాలు తెలిపాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: