గ్లిజరిన్ తో ఇలా చేస్తే చర్మ సమస్యలు దూరం...
గ్లిజరిన్‌ను చర్మం మీద వాడడం వల్ల చర్మానికి ఉన్న దుమ్ము ధూళి తొలగిపోయి చర్మం క్లీన్‌గా ఉంటుంది. ఇది మంచి క్లెన్సర్‌గా పని చేస్తుంది. కాబట్టి మీరు దీనిని ఇలా కూడా ఉపయోగించొచ్చు. నిద్రపోవడానికి ముందు ఈ మిశ్రమాన్ని మీరు మీ ముఖం మీద అప్లై చేసుకుంటే చర్మం మరియు సూక్ష్మ రంధ్రాలను శుభ్రపరచడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రతి రోజూ గ్లిజరిన్ మీ ముఖం మీద అప్లై చేసుకునే నిద్రపోండి. దీంతో మీ చర్మం మెరుస్తుంది. అలాగే చర్మం చాలా శుభ్రంగా ఉంటుంది.
దీనిని చర్మం మీద నేరుగా లేదా ఫేస్ ప్యాక్ ఇంకా ఫేస్ మాస్క్‌ల కొరకు వాడొచ్చు. పొడి చర్మానికి ఇది నిజంగా మంచి మేలు చేస్తుంది చాలా మందికి శీతాకాలంలో చర్మం పొడిబారి పోతుంటుంది. అటువంటి వాళ్ళు గ్లిజరిన్‌ని కాటన్ మీద వేసి చర్మం మీద అప్లై చేసుకోవచ్చు. గ్లిజరిన్ చర్మాన్ని తేమగా కూడా ఉంచుతుంది. చర్మానికి మంచి మాయిశ్చరైజర్ అవుతుంది మృదువుగా కూడా ఉంటుంది.చాలా మంది ముఖంపైన మొటిమలు వంటివి ఉంటాయి. క్రమంగా మీరు గ్లిజరిన్‌తో ఫేస్ ప్యాక్ చేసి వేసుకుంటే మొటిమలు తొలగిపోతాయి.