చక్కని స్కిన్ టోన్ కి చక్కటి చిట్కాలు..

Purushottham Vinay
మన స్కిన్ టోన్ అనేది ఎప్పుడూ ఒకలా ఉండదు.వాతావరణాన్ని బట్టి మారిపోతూ ఉంటుంది.ఇక ఇప్పుడు ఎండాకాలం కావటంతో మన స్కిన్ ఈ వేడికి మాడిపోవడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడున్న కరోనా పరిస్థితిల్లో బయటకు వెళ్లకపోయినా కాని వేడి వల్ల మన స్కిన్ టోన్ తగ్గిపోతూ ఉంటుంది. కాబట్టి ఈ ఎండాకాలంలో స్కిన్ టోన్ మెరుగ్గా వుండాలంటే లిక్విడ్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవాలి. అంటే మజ్జిగ, పండ్ల రసాలు ఎక్కువగా త్రాగుతూ ఉండాలి.వాటి వలన శరీరంలోని వేడి తగ్గి స్కిన్ టోన్ బాగుంటుంది.మీరు అందంగా ఉండాలి అంటే డైట్ కూడా చాలా ముఖ్యం. తీసుకునే ఆహారంలో పోషకాహారం ఉండేటట్టు చూసుకోవాలి. ఎక్కువ ఆయిల్, ఫ్యాట్స్ ఉంటే ఆహరం తీసుకోవడం వల్ల కూడా మీ అందం దెబ్బతింటుంది కాబట్టి మీరు తినే ఆహారం పై కూడా కాస్త దృష్టి పెట్టాలి.

ఇక ఈ ఎండాకాలంలో ఎక్కువగా సన్ స్క్రీన్ లోషన్ లాంటివి ఉపయోగిస్తూ ఉండాలి. ఇక ముఖ్యంగా ఈ కాలంలో చెమటకి ముఖం జిడ్డు బారడం ఖాయం.అందువల్ల మీ స్కిన్ టోన్ దెబ్బతింటుంది. మంచి స్కిన్ టోన్ కోసం కొన్ని బంతి పూలను తీసుకుని గోరు వెచ్చటి నీళ్లలో రాత్రంతా వదిలేయాలి. ఆ మిశ్రమంలో మీరు పెరుగు, గంధం పేస్ట్ వేసి మొత్తం అన్నిటినీ కలిపి స్మూత్‌గా తయారుచేసుకోవాలి. కళ్ళు, పెదవుల ప్రాంతంలో వదిలేసి మొత్తం ముఖమంతా కూడా అప్లై చేసుకోండి. 20 నిమిషాల పాటు అలాగే వదిలేసి తర్వాత ముఖం నీళ్లతో కడిగేసుకోండి. దీని వల్ల మీకు మంచి బెనిఫిట్స్ కలుగుతాయి పైగా మీరు అందంగా కూడా ఉంటారు.ఇలా చేస్తే మీ ముఖం ఎంతో కాంతివంతంగా నిగనిగలాడుతూ ఉంటుంది.

 ఇక మరొక పద్ధతి ఏంటంటే రెండు టీ స్పూన్ల ఓట్స్ ని ఒక స్పూన్ బాదం ఒక స్పూన్ రోజ్ వాటర్ ఒక స్పూన్ తేనె మరియు ఒక స్పూన్ పెరుగు వేసి మెత్తని పేస్టులాగా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖం మీద అప్లై చేసుకుని 20 నిమిషాల పాటు ఉంచి కడిగేసుకోవాలి.ఇలా చేస్తే మీ ముఖం జిడ్డుగా అవ్వకుండా అలాగే పొడిబారకుండా చాలా అందంగా ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: