మొటిమలు తగ్గి ముఖం నున్నగా అవ్వడానికి ఈ చిట్కాలు పాటించండి....

Purushottham Vinay
మొటిమలు ఎంతలా బాధిస్తాయో తెలిసిందే.ముఖం ఎంత తెల్లగా కాంతివంతంగా వున్నా కాని మొటిమలు మాత్రం తీవ్రంగా బాదిస్తుంటాయి. ఎన్ని క్రీములు వాడినా ఎలాంటి ఉపయోగం ఉండదు.ఇక మొటిమలు శాశ్వతంగా తగ్గి ముఖం కాంతివంతంగా ఉండాలంటే ఈ పద్ధతులు పాటించండి.జామాకు మొటిమలని తగ్గించడానికి చాలా ఉపయోగపడుతుంది. ఈ జామ ఆకులో శక్తివంతమైన యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఇంకా శోద నిరోధక లక్షణాలు ఉన్నాయి. ఇవి ముఖం మీద మొటిమల రూపాన్ని తగ్గించడమే కాకుండా మొటిమలను నివారిస్తాయి. జామ ఆకును నీటిలో వేసి ఉడకబెట్టి, ఆ నీటితో రోజూ ముఖాన్ని కడగాలి.ఇలా చేస్తే తప్పకుండా మొటిమలు తగ్గిపోతాయి.మెంతులు యాంటీ సెప్టిక్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటాయి, ఇది చర్మంపై మొటిమల మచ్చల రూపాన్ని తగ్గించడానికి బాగా సహాయపడుతుంది. కొద్దిగా మెంతులు బచ్చలికూర లేదా మెంతులు విత్తనాలను నీటిలో ఉడకబెట్టి, ప్రతిరోజూ ముఖం మీద ఒక వారం పాటు పూయండి మరియు ముఖం మీద మొటిమలు కనిపించవు.

ఇక పుదీనా ఆకులో యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. ఇది చర్మాన్ని శుభ్రపరచడమే కాక అద్భుతమైన టోనర్‌గా కూడా పనిచేస్తుంది. దీనిలోని సాలిసిలిక్ ఆమ్లం మొటిమలను నివారించడానికి సహాయపడుతుంది. పుదీనా ఆకులు లేదా రసం గ్రైండ్ చేసి పేస్ట్ చేసి ముఖానికి అప్లై చేసి నీటితో బాగా కడగాలి.ఇలా రోజు చేస్తే ముఖంపై ఒక్క మొటిమ కూడా రాదు.వేపాకు చర్మంలో స్రవించే అదనపు నూనెను నియంత్రిస్తుంది మరియు రంధ్రాలను అడ్డుకోకుండా ధూళిని నిరోధిస్తుంది. ప్రధానంగా చర్మ వ్యాధులు మరియు మొటిమలకు చికిత్స చేస్తుంది. మీరు పేస్ట్ ను మెత్తగా చేసి మొటిమలపై తగ్గిపోతాయి.ఇక ఈ పద్ధతులు తూచ తప్పకుండ పాటిస్తే ముఖంపై మొటిమలు తగ్గిపోతాయి. ఇంకెందుకు ఆలస్యం మొటిమలతో బాధపడేవారు ఈ పద్ధతులు పాటించండి. ముఖాన్ని అందంగా మార్చుకొండి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: