ఈ వేసవి కాలంలో అధిక ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్నారా.. ఈ చిన్న చిట్కా పాటించండి మరి..

Divya

వేసవి కాలం వచ్చి దాదాపు 40 రోజులు గడుస్తున్నప్పటికీ, రోజు రోజుకి వుక్కపోత ఎక్కువవుతోంది. సూర్యుడు నడి నెత్తి మీద తాండవం ఆడుతున్నాడు. ఈ ఎండ కారణంగా మన శరీరంలో నీటి శాతం మొత్తం ఆవిరైపోయి, శరీరం డీహైడ్రేషన్ కు గురి అవుతోంది. అంతేకాకుండా చెమట దుర్వాసన కారణంగా మన వాసన మనమే భరించలేని పరిస్థితి కి చేరుకుంటున్నామ. అయితే ఈ వేసవి కాలంలో కూడా తాజాగా, పరిమలం గా ఉండాలి అంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..

నిమ్మరసం, రోజ్ వాటర్ తో తాజాదనాన్ని ఇట్టే పొందవచ్చు.. అయితే ఇందుకోసం నిమ్మరసం అర కప్పు, రోజ్ వాటర్  ఐదు చెంచాలు తీసుకొని, స్నానం చేసే నీళ్ళలో వేసి బాగా కలపాలి. ఒక 10 నిమిషాలు ఆ నీటిని అలాగే వదిలేసి, ఆ తర్వాత ఈ నీటితో స్నానం చేయడం వల్ల చర్మం శుభ్రం అవ్వడమే కాకుండా,  తిరిగి ప్రకాశవంతంగా ఉంటుంది. నిమ్మరసం చెమటకు చెక్ పెట్టి, జిడ్డు తనాన్ని నివారిస్తే, రోజ్ వాటర్ మనల్ని అధిక సమయం తాజాగా ఉండేలాగా చేస్తుంది..
ఇక అలాగే ఆపిల్ సైడర్ వెనిగర్ తో కూడా తాజాగా ఉండవచ్చు.. ఇందుకోసం రెండు కప్పుల ఆపిల్ సైడర్ వెనిగర్ తీసుకొని, బాత్ టబ్ లో వేసుకొని స్నానం చేసినట్లయితే, ఆ నీటిలో పది నుంచి పదిహేను నిమిషాల పాటు శరీరం మునిగి ఉండేలా చేస్తే, ఎండ కారణంగా కమిలి పోయిన చర్మం తిరిగి తాజాగా మారడంతో పాటు దుర్వాసన  నుంచి కూడా విముక్తి కలుగుతుంది.. అంతే కాకుండా చర్మం మీద ఏర్పడిన మలినాలు, మృతకణాలు తొలగిపోయి, శరీరం ప్రకాశవంతంగా మెరుస్తుంది..

ఇక పచ్చిపాలు, తేనె సమపాళ్లలో తీసుకొని, ఈ మిశ్రమాన్ని స్నానం చేసే నీటిలో కలుపుకోవాలి. ఈ నీటితో స్నానం చేయడం వల్ల చర్మం తిరిగి తాజాగా మారడంతో పాటు ప్రకాశవంతంగా కూడా కనిపిస్తుంది. పాలలోని లాక్టిక్ ఆమ్లం చర్మంపై ఉండే మృతకణాలను తొలగిస్తే, తేనె చర్మానికి సహజసిద్ధంగా తేమను అందించి, చర్మం తాజాగా ఉండేలా చేస్తుంది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: