నిత్య యవ్వనంతో అందంగా మెరిసిపోవడానికి ఈ చిట్కాలను పాటించండి.....

Purushottham Vinay
పసుపు ముఖానికి మంచి తేజస్సుని పెంపొందిస్తుంది. దీనిలో ఉన్న యాంటిబయోటిక్, యాంటి సెప్టిక్ గుణాల వ‌ల్ల‌ ముఖంపై మొటిమలు రాకుండా ఉంటాయి. మన ముందు తరం ఆడవాళ్లు తలస్నానం చేసిన ప్రతిసారి ముఖానికి పసుపు రాసుకొంటారు. అందుకే వారి ముఖంపై మొటిమలు కనిపించవు. పైగా చర్మం ఛాయ సైతం మెరుగుపడుతుంది. పసుపు శరీరంపై ఉన్న అవాంఛిత రోమాలను తగ్గిస్తుంది.శెనగ పిండిలో కొద్దిగా పసుపు కలిపి నలుగు పెట్టుకొని స్నానం చేస్తే స్కిన్ అందంగా తయారవుతుంది.మన ముందు తరాల వారు సబ్బుని ఉపయోగించేవారు కాదు. దానికి బదులుగా నలుగుపిండి ఉపయోగించేవారు. దానికోసం పెసరపిండి, శెనగపిండి పసుపు కలిపి ఉపయోగించేవారు. ఇది చర్మ రంధ్రాల్లోని మురికిని వదిలిస్తుంది. చర్మంపై చేరిన మృతకణాలను తొలగిస్తుంది. దీనివల్ల చర్మం మృదువుగా మారడంతో పాటు ప్రకాశవంతంగా కనిపిస్తుంది.


పైగా చర్మంపై ఉన్న అవాంఛిత రోమాలు  సైతం తగ్గుముఖం పడతాయి.ఈ మిశ్రమంలో పాలు లేదా పెరుగు కలిపి ఉపయోగిస్తే చర్మం శుభ్రపడటం మాత్రమే కాదు మాయిశ్చరైజ్ కూడా అవుతుంది.ఈ మిశ్రమంలో పాలు లేదా పెరుగు కలిపి ఉపయోగిస్తే చర్మం శుభ్రపడటం మాత్రమే కాదు మాయిశ్చరైజ్ కూడా అవుతుంది.ఇప్పుడంటే మనం చర్మానికి మాయిశ్చరైజర్ రాసుకొంటున్నాం. కానీ ఒకప్పుడు దానికోసం తాజావెన్నను ఉపయోగించేవారు. దీనివల్ల స్కిన్ పాపాయి చర్మం అంత లేతగా మారిపోతుంది. పైగా ఒకసారి రాసుకొంటే.. ఆ రోజంతా చర్మం పొడిబారకుండా ఉంటుంది. పొడిబారిన, పగిలిన పెదాలను తిరిగి మామూలుగా మార్చడానికి మనం లిప్ బామ్  ఉపయోగిస్తాం. కానీ ఆ రోజుల్లో వెన్నను ఉపయోగించేవారు. దీనివల్ల పెదవులు అందంగా కనిపిస్తాయి. రాత్రి నిద్రపోయే ముందు పెదవులకు వెన్న రాసుకొంటే.. మరుసటి రోజు లిప్ బామ్ రాసుకోవాల్సిన అవసరం ఉండదు.ఇక ఇలాంటి మరెన్నో బ్యూటీ టిప్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో ఆసక్తికరమైన విషయాలు గురించి తెలుసుకోండి...

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: