ఎండాకాలంలో పుట్టే చెమట చిక్కులకు పరిష్కారమే లేదా..?

Divya

ఎండాకాలం వచ్చిందంటే చాలు అనేక రకాల సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. మన శరీరం డీహైడ్రేషన్ కు గురి అవుతుంది. అంతే కాకుండా చర్మం పొడిబారిపోవడం, చర్మం మీద చెమట పొక్కుల రావడం అలాగే చెమట దుర్గంధం లాంటివి ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అయితే ఈ ఎండాకాలంలో ఈ చెమట చిక్కుల నుండి బయటపడాలి అంటే కొన్ని జాగ్రత్తలు పాటిస్తే చాలు అంటున్నారు నిపుణులు. అయితే ఆ జాగ్రత్తలేంటో ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం..

వంట సోడా :
ఒక టేబుల్ స్పూన్ వంటసోడా, ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం బాగా కలిపి, బాహుమూలాల్లో ఎక్కువగా చెమట దుర్గంధం వచ్చే చోట అప్లై చేసి, సుతిమెత్తగా మర్దనా చేయాలి. ఐదు నిమిషాల తరువాత కడిగేసుకుంటే సరిపోతుంది. వంట సోడా లోని యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు వాసనకు కారణం అయ్యే బ్యాక్టీరియాను నాశనం చేస్తాయి.

లావెండర్ ఎసెన్షియల్ ఆయిల్ :
ఒక గాజు స్ప్రే సీసాలో కొన్ని నీళ్ళు పోసి, అందులో కొన్ని చుక్కలు లావెండర్ ఎసెన్షియల్ ఆయిల్ ను కలవాలి. దీనిని బాహుమూలాల్లో రోజుకు రెండు సార్లు స్ప్రే చేసుకోవడం వల్ల చెమట దుర్గంధం నుంచి బయటపడవచ్చు..

కలబంద :
కలబంద గుజ్జును తీసి బాహుమూలాల్లో రాత్రి పడుకునే ముందు అప్లై చేయాలి. ఉదయం గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మం తాజాగా ఉండడమే కాకుండా చెమట వల్ల వచ్చే దుర్గంధ వాసనను కూడా దూరం చేసుకోవచ్చు. కలబంద లో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు చర్మ చెమట వాసనను దూరం చేస్తాయి.

బాదం ఆయిల్:
కొన్ని చుక్కల బాదం ఆయిల్ ను అర చేతిలోకి తీసుకొని, బాహుమూలల్లో రుద్దుతూ సుతిమెత్తగా అప్లై చేయాలి. ఉదయాన్నే చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల కూడా మన శరీరం విడుదలచేసే చెమటను, చెమట వల్ల వచ్చే దుర్గంధ వాసనను కూడా దూరం చేసుకోవచ్చు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: