మేకప్ రిమూవ్ చేయడం లేదా..? అయితే ఈ సమస్యలు తప్పవు..
సాధారణంగా మేకప్ వేసిన తర్వాత పడుకునే ముందు, ఆ మేకప్ ను ఖచ్చితంగా తీసేసుకోవాలి. లేకపోతే ముఖం మీద చిన్నపాటి మొటిమలు, నల్ల మచ్చలు రావడం వంటి సమస్యలు ఎదురవుతాయి. అంతేకాకుండా మేకప్ రిమూవ్ చేయకపోవడం వల్ల ముఖం మీద సహజంగా ఏర్పడిన తేమ మొత్తం ఆవిరైపోయి చర్మం పొడిబారుతుంది. అయితే మీరు మేకప్ రిమూవ్ చేసే ఆయిల్ ఏది వాడుతున్నారో మీకు తెలుసా.. మీరు వాడే మేకప్ రిమూవర్ మీ చర్మానికి మంచి చేస్తుందా? లేక చెడు చేస్తుందో? అని ఖచ్చితంగా తెలుసుకుని ఉండాలి. మార్కెట్లో దొరికే ఏది పడితే అది మేకప్ రిమూవర్ ని తీసుకొచ్చి, మీ స్కిన్ కి ఉపయోగించకూడదు. మీకు మేకప్ రిమూవర్ దొరకకపోతే , మంచి నీళ్ల ను ఉపయోగించి కూడా శుభ్రం చేసుకోవచ్చు . ఒకవేళ మేకప్ రిమూవ్ చేయకపోతే ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం
బ్రేక్ ఔట్స్ :
మేకప్ రిమూవ్ చేసి, ఫేస్ ని మంచినీళ్ళతో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయకపోతే ముఖం మీద మురికి, డెడ్ స్కిన్ సెల్స్ అక్కడే ఉండిపోయి,పోర్స్ క్లాగ్ చేసి, క్రానిక్ ఇన్ఫ్లమేషన్ కు దారితీస్తాయి. ఫలితంగా ముఖం మీద మొటిమలు ఏర్పడటం జరుగుతుంది.
కళ తగ్గిపోతుంది :
మేకప్ లేకుండా నిద్రపోవడం కూడా ఒక కారణం అని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ముఖం పై ఉండే ఆయిల్, డెడ్ స్కిన్ సెల్స్ తల క్రింద ఉన్న పిల్లో కి తగిలి ఉండడం వల్ల, కాంప్లెక్షన్ డల్ గా అయిపోతుంది. ఇక చర్మం హెల్దీగా కనిపించాలంటే రెగ్యులర్ గా క్లేన్సింగ్ చేసుకోవడం, ఎక్స్ ఫోలియేట్ చేయడం అవసరం. ఇందుకోసం మంచిస్కిన్ కేర్ రొటీన్ ని ఫాలో అవ్వొచ్చు.
ముడతలు రావడం :
మురికి, మేకప్ చర్మం వద్ద పేరుకుపోయి, అది ఆక్సిడేటివ్ డామేజ్ కి దారితీస్తుంది. ఇది స్కిన్ బ్యారియర్ ను బ్రేక్ డౌన్ చేసి,చర్మం త్వరగా ముడతలు పడేలా చేస్తుంది.
రాషెస్ :
మేకప్ లో పర్ఫ్యూమ్స్ ఉంటాయి. ఇవి ఎక్కువ సమయం స్కిన్ మీద ఉండిపోతే, ఇన్ఫ్లమేషన్ కి దారితీయవచ్చు. సెన్సిటివ్ స్కిన్ ఉన్నవారికి ఈ సమస్య వచ్చే అవకాశం ఎక్కువ.
కాబట్టి మీరు ఎంత అలసిపోయి ఉన్నా సరే, ఫేస్ వాష్ చేసుకొని,నిద్రపోవడం మాత్రం మరవద్దు. ఇలా రోజుకు రెండు సార్లు ముఖం కడుక్కోవడం వల్ల సహజసిద్ధమైన చర్మ కాంతి వస్తుందని నిపుణులు సూచిస్తున్నారు.