ఈ పద్ధతులు పాటిస్తే అందమైన జుట్టు మీ సొంతం...

Purushottham Vinay
ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి...మనం అందంగా ఉండాలంటే మన మొహం తో పాటు జుట్టు కూడా ఆరోగ్యంగా ఉండాలి.జుట్టు కూడా ఆరోగ్యంగా ఉంటే చాలా అందంగా వుంటారు.మగ లేదా ఆడ అనే తేడా లేకుండా చాలా మందికి జుట్టు సంబంధిత సమస్యలు చాలా ఉన్నాయి.జుట్టును మరింత ఆకర్షణీయంగా మరియు జుట్టును చిక్కు పడకుండా చూడటానికి కొన్ని మార్గాలు ఉన్నాయి. అవి ఏమిటో మీరు ఇప్పుడు తెలుసుకోండి.

3 టేబుల్ స్పూన్ల కలబంద జ్యూస్‌తో 1 కప్పు పెరుగు వేసి బాగా కలపాలి మరియు ఈ మిశ్రమాన్ని తలపై రాయండి. అలా చేసేటప్పుడు జుట్టును మూలాలకు, పూర్తిగా జుట్టు పొడవునా రాయడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చు. 30 నిమిషాలు వెళ్లి తల స్నానం చేయండి. వారానికి ఒకసారి ఇలా చేయడం వల్ల పొడిబారడం మరియు జుట్టు రాలడం ఆగిపోతుంది. 3 టేబుల్ స్పూన్ల ఆలివ్ నూనెతో 1 కప్పు పెరుగు జోడించండి. కొద్దిగా నీరు వేసి బాగా కలపండి మరియు తలకు రాయండి. 40 నిమిషాల తరువాత, కొద్దిగా హెయిర్‌ షాంపు ఉపయోగించి స్నానం చేస్తే, ఈ సమస్యను సులభంగా పరిష్కరించవచ్చు.

మీ జుట్టు మెరిసేలా ఉంచడానికి ఈ చిట్కా మీకు సహాయం చేస్తుంది. 1 గుడ్డు కొట్టి లోపలి మిశ్రమాన్ని ఒక గిన్నెలో వేయాలి. దానికి 3 టేబుల్ స్పూన్ల బాదం నూనె వేసి బాగా మిక్స్ చేసి తలకు రాయాలి. 40 నిమిషాల తర్వాత తలపై స్నానం చేస్తే జుట్టు పొడిబారడం మాయమవుతుంది.పండిన అరటిపండును మాష్ చేసి 1 కప్పు పెరుగుతో కలపండి. తరువాత తలమీద పూసి 30 నిమిషాలు తర్వాత స్నానం చేయండి. ఈ చిట్కా మీ జుట్టు మీద అద్భుతంగా పనిచేస్తుంది.ఇలాంటి మరెన్నో బ్యూటీ టిప్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో సౌందర్య చిట్కాలు గురించి తెలుసుకోండి...



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: