తడి జుట్టుకి “బామ్మ” వైద్యం..ఇలా చేస్తే జుట్టు గట్టిదనం గ్యారంటీ

Bhavannarayana Nch

చాలా మంది జుట్టు సంరక్షణలో అనేక జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు..రకరకాల ఆయిల్స్..రాయడం..అనేక రకాల హెయిర్ పాక్స్ పెట్టడం..జుట్టు పెరగడానికి ఇలా ఎన్నో పద్దతులు పాటిస్తూ చాలా మంది సక్సెస్ అవుతూ ఉంటారు..అయితే ఇలాంటి వాళ్ళలో కూడా జుట్టు..ఊడిపోతు ఉంటుంది.ఎన్నో జాగ్రత్తలు పాటించినా సరే జుట్టు ఎందుకు ఊదిపోతోంది అనే విషయం ఎవరికీ అర్థం కానే కాదు..కానీ చిన్న చిన్న లోపాలుఆరోగ్యంగా ఉన్న జుట్టుని కూడా దెబ్బతీస్తాయి..అందుకు గల కారణాలని పరిశీలిస్తే..  

 

మనలో చాలా మంది తలారా స్నానం చేసిన తరువాత టవల్స్ తో తుడుచుకుంటూ ఉంటారు..అయితే ఈ విషయంలో సరైన టవల్స్ ఉపయోగించక పోవడం వలన ఎంతో ఆరోగ్యవంతమైన జుట్టు సైతం ఊడిపోయే ప్రమాదం ఉంది..ముఖ్యంగా స్త్రీలలో ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుంది..వారికీ జుట్టు ఎక్కువగా ఉండటం తలారా స్నానం చేసిన తరువాత..తడిగా ఉన్న జుట్టు తొందరగా ఆరిపోవడానికి ఫ్యాబ్రిక్ లేదా టెర్రీ..లేదా చాలా మందంగా ఉన్న తుండ్లు ఉపయోగిస్తారు..వీటిని ఉపయోగిస్తూ జుట్టుని తుడుచుకోవడం వలన జుట్టు ఎంతో వత్తిడికి గురవుతుంది. వెంట్రుకల కొనలు తెగటం వంటి సమస్యలు వస్తాయి.

 

పొడి జుట్టుకంటే కూడా తడిగా ఉండే జుట్టు ఎక్కువగా ఈ ప్రభావానికి గురవుతుంది..ఎందుకంటే తడిగా ఉన్న జుట్టు కుదుళ్ళు అంతగా గట్టిగా ఉండవు..తడి జుట్టుకి ఎక్కువగా స్థితి స్థాపకత ఉంటుంది అందుకే తెగిపోవడానికి ఎక్కువగా ఆస్కారం ఉంటుంది. ఇలాంటి సమయంలో కఠినంగా, పొడిగా ఉండే టవల్ లేదా టెర్రీ టవల్ తో జుట్టు లాగటం వలన మృదువుగా ఉండే వెంట్రుకల బయటిపొర ప్రమదానికి గురై జుట్టు రాలిపోతుంది.అందుకే మెత్తటి తుండ్లు కానీ మైక్రో ఫైబర్ తుండ్లు వాడటం మంచిది.అలా కాకపొయినా జుట్టుని వేరు వేరు చేస్తూ ఉంచడం వలన జుట్టు ఆరోపోతుంది కూడా కానీ దీనికి ఎక్కువ సమయం పడుతుంది.

 

జుట్టుని సహజసిద్ధమైన పద్దతుల్లో కూడా ఆరబెట్టవచ్చు..అదే సహజంగా గాలి ద్వారా ఆరబెట్టడం. కొంత మంది జుట్టును ఆరబెట్టడానికి కృత్రిమ హెయిర్ డ్రయర్ లను వాడతారు. వీటి వలన జుట్టు ఆరోగ్యం ప్రమాదనికే గురవుతుంది తప్ప వేరే ప్రయోజనం ఉండదు.అయితే మన బామ్మలు..పూర్వీకులు వాడే పద్దతులు వాడటం వలన జుట్టు ఆరడమే కాకుండా జుట్టు ఊడిపోకుండా..ఎంతో దృడంగా తయారవుతుంది..చుండ్రు కూడా పట్టదు..అదేమిటంటే..స్నానం చేసిన తరువాత మెత్తటి తుండుతో పై పైన తుడిచి..సాంబ్రాణి పొగ కురులకి పట్టించడం వలన ఈ ప్రయోజనం కలుగుతుంది..అయితే ఈ పద్దతికి కొంచం సమయం పట్టినా సరే కేశాల రక్షణకి  ఎంతో ఉపయోగపడుతుంది..


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: