రూ.2000 నోట్లు.. మార్చేందుకు కొత్త ప్లాన్లు?

Chakravarthi Kalyan
ఇప్పుడు ఎక్కడ చూసినా అంతా 2000 నోటు జపమే చేస్తున్నట్లుగా తెలుస్తుంది. సోషల్ మీడియాలో చూసినా, ఎక్కడ చూసినా దీనిపైనే జోకులు, సెటైర్లు, న్యూస్ లు రావడం చూస్తున్నాం.‌ మరో పక్కన ఈ 2000 నోట్లు రద్దు విషయంలో గతంలో రద్దయిన నోట్లు ఇంకా ఇప్పుడు రద్దు అయిన నోట్లు ఒక తమిళ డబ్బింగ్ సినిమా రెండు పార్ట్స్ గా రిలీజ్ అయిన టైం లోనే జరిగాయని చెప్పుకొస్తున్నారు.

అయితే పేదల దగ్గర ఈ 2000 నోట్లు ఉండకపోవచ్చు. గాని మధ్యతరగతి వాళ్ళ దగ్గర అయితే ఎంతో కొంత ఉంటాయని అంటున్నారు. అవి ఇప్పుడు వాళ్లు జమ చేసేస్తారు బ్యాంకుల్లో. మధ్యప్రదేశ్ ఇంకా పశ్చిమ బెంగాల్లోని ఇండోర్లో ఈ 2000 నోట్ల రూపాయల మార్పిడి సులభంగా జరిగిపోతున్నట్లుగా తెలుస్తుంది. అది ఎలాగంటే, దేని ద్వారా ఈ మార్పిడి జరుగుతుందంటే పెట్రోల్ బంకుల ద్వారా అని తెలుస్తుంది.

అక్కడి బడాబాబులు వాళ్ల దగ్గర ఉన్న సొమ్మును కొంతమంది టీం ని పెట్టి ఇలా తమ మనుషుల ద్వారా, తెలిసిన వాళ్ల ద్వారా అక్కడ పెట్రోల్ బంకుల ద్వారా మార్పిడి చేస్తున్నట్లుగా తెలుస్తుంది. పెట్రోల్ కొట్టించుకుని ఒక 2000 రూపాయల నోట్ ఇస్తే వాళ్లు దానికి చిల్లర ఇచ్చేటట్లుగా, అలా మార్పిడి జరుగుతున్నట్లుగా తెలుస్తుంది. పెట్రోల్ బంకుల ద్వారానే ఎందుకు అంటే, పెట్రోల్ బంకుల్లో ఏ రోజు వచ్చిన డబ్బుని ఆరోజు వాళ్ళు బ్యాంకుల్లో డిపాజిట్ చేసేస్తారు కాబట్టి అని అంటున్నారు.

ప్రతి 2000 రూపాయలు నోటికి 50 రూపాయలు ఇస్తానంటే ఆ వర్కర్సే మార్చేస్తారు. ఇలా పెట్రోల్ బంకులు, కాలేజీలు, హాస్పిటల్స్ ద్వారా కూడా మార్పిడి చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇదంతా ఎందుకు అంటే వాళ్ళు బ్యాంకుల్లో డిపాజిట్ చేసే మొత్తాన్ని బట్టి వాళ్ళ దగ్గర ఎంత సొమ్ము ఉందనేది ప్రభుత్వానికి తెలిసిపోతుందని వీళ్ళ ఆలోచన. అందుకే ఈ రకంగా వీళ్ళు చేసుకొస్తున్నారని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: