సురక్షితమైన రాబడి కోసం మంచి స్కీంలు ఇవే?

Purushottham Vinay
పోస్టాఫీసు పథకాల్లో ఎలాంటి రిస్క్  ఉండదు. మారుతున్న కాలంతో పాటు చాలా ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్‌లు వచ్చాయి. కానీ నేటికీ చాలా మంది పాత పద్ధతిలోనే పెట్టుబడి పెట్టేందుకు అలవాటు పడ్డారు.  ప్రజలు పోస్టాఫీసు పథకాల్లో పెట్టుబడి పెట్టేందుకు చాలా ఇష్టపడుతున్నారు. మీరు వివిధ పోస్టాఫీసు పథకాలలో పెట్టుబడి పెట్టాలనుకుంటే ఆ పథకాల గురించిన సమాచారాన్ని  తెలుసుకుందాం. 2023 బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పోస్టాఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ ఇంకా అలాగే సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్‌లో మార్పులు చేశారు. ఆ వివరాలు పూర్తిగా తెలుసుకుందాం..పోస్టాఫీసు మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ (MIS) లో ఏకమొత్తంలో పెట్టుబడి పెట్టడం ద్వారా ప్రతి నెలా కూడా స్థిర ఆదాయాన్ని పొందే అవకాశం ఉంటుంది. బడ్జెట్ 2023 పెట్టుబడి పరిమితిని ఒకే ఖాతాకు రూ. 9 లక్షలు ఇంకా ఉమ్మడి ఖాతా కోసం రూ. 15 లక్షలకు పెంచింది. అయితే వడ్డీ రేటుని మాత్రం 7.10 శాతంగా నిర్ణయించింది.


ఇక సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ సీనియర్ సిటిజన్లకు సురక్షితమైన పెట్టుబడి ఎంపికను అందించడం లక్ష్యంగా పెట్టుకుంది నరేంద్ర మోదీ ప్రభుత్వం. ఇది మొత్తం 8.00 శాతం వార్షిక వడ్డీ రేటును అందిస్తుంది. ప్రభుత్వం దాని పెట్టుబడి పరిమితిని రూ. 15 లక్షల నుండి రూ. 30 లక్షలకు పెంచడం జరిగింది.మీరు మీ ఇంట్లో మీ ఆడపిల్లల సురక్షితమైన భవిష్యత్తు కోసం పెట్టుబడి పెట్టాలనుకుంటే..అప్పుడు మీరు సుకన్య సమృద్ధి యోజనలో పెట్టుబడి పెట్టవచ్చు. ఈ పథకం కింద మీరు ఒక ఆర్థిక సంవత్సరంలో మొత్తం రూ. 250 నుంచి రూ. 1.5 లక్షల దాకా పెట్టుబడి పెట్టవచ్చు. ఇందులో ఖాతాదారుడికి మొత్తం 7.6 శాతం రాబడి వస్తుంది.అలాగే కిసాన్ వికాస్ పత్ర పథకంలో పెట్టుబడి పెట్టడం వల్ల మీరు ఈజీగా 7.2 శాతం రాబడిని పొందవచ్చు. ఇక ఈ పథకం ప్రత్యేకత ఏంటంటే.. మీరు రూ. 1,000 నుంచి గరిష్టంగా ఎంత మొత్తాన్ని అయినా ఇందులో పెట్టుబడి పెట్టవచ్చు. ఈ మొత్తం డబ్బు కూడా రూ.100 గుణకారంలో మాత్రమే ఉండాలి. ఇందులో మీ డబ్బు మొత్తం 120 నెలల్లో రెట్టింపు అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: