రైతులకు ఎక్కువ డబ్బులు వచ్చే పద్ధతులు ఇవే?

Purushottham Vinay
ఇక మన దేశంలోని కొన్ని గ్రామాలు ఇప్పుడు సాంకేతిక పరంగా నగరాలకు కూడా ధీటుగా మారాయి. ఈ మధ్య కాలంలో వ్యవసాయ రంగం టెక్నాలజీ పరంగా చాలా ముందుకు వేగంగా దూసుకుపోయింది.ఎందుకంటే దేశంలోని రైతులు అటువంటి ప్రభావవంతమైన టెక్నాలజీలను పొందుతున్నారు. ఇది వారి లాభాలను చాలా రెట్లు పెంచుతోంది. ఇక రైతులు కొన్ని  సులభమైన పద్దతులను పాటించడం వల్ల వారి ఖర్చులు ఆదా కావడమే కాకుండా వారి సంపాదనని కూడా మరింతగా పెంచుకోవచ్చు.ఇక డ్రోన్ అనేది సురక్షితమైన ఇంకా సౌకర్యవంతమైన ప్రదేశంలో ఉంటూనే ఎన్నో రకాల పనులను పెద్ద మొత్తంలో నిర్వహించగల సాంకేతికత. అందుకే డ్రోన్ సాంకేతికత అనేది నిజంగా వ్యవసాయ రంగానికి ఒక వరం.చెప్పాలంటే సాధారణంగా పొలాల పరిమాణం అనేది చాలా పెద్దది. అందుకే ఈ డ్రోన్‌ల సహాయంతో రైతులు పురుగుమందులను పిచికారీ చేయవచ్చు. ఎరువులను కూడా చాలా వేగంగా పిచికారీ చేయవచ్చు. ఇంకా అలాగే అదే సమయంలో పంటల పెరుగుదలను కూడా కచ్చితత్వంతో గమనించవచ్చు. ఇండియాలో డ్రోన్లు రైతులకు రెండు విధాలుగా హెల్ప్ చేస్తున్నాయి.


ముందుగా అవి రైతుల ఖర్చు తగ్గించి, సకాలంలో పనులు పూర్తి చేస్తూ పంటలపై ఎప్పుడూ కూడా నిఘా ఉంచి వ్యవసాయాన్ని లాభసాటిగా చేస్తున్నాయి. ఇంకా అదే సమయంలో రైతులు తమ డ్రోన్‌ల సేవలను ఇతర రైతులకు కూడా అద్దెకు ఇస్తున్నారు. ఇక దీనివల్ల కూడా వారు అదనపు ఆదాయాన్ని  పొందుతున్నారు. డ్రోన్‌లను కొనుగోలు చేసేందుకు భారత ప్రభుత్వం సబ్సిడీతో పాటు ఇంకా అలాగే శిక్షణ కూడా ఇస్తోంది.ఈ డ్రోన్ల తర్వాత రెండవ టెక్నాలజీ వచ్చేసి నానో యూరియా. నానో యూరియా అనేది చాలా సందర్భాలలో సంప్రదాయ ఎరువుల కంటే మెరుగైనదిగా గుర్తించబడింది. దీని మెయింటైనన్స్ కూడా చాలా సులభం.ఇంకా అలాగే ఇది ఉపయోగించడం కూడా సులభమే. అయితే దాని సహాయంతో పంటల దిగుబడి కూడా చాలా మెరుగ్గా ఉంటుంది. ఇంకా అదే సమయంలో దాని ఖర్చు కూడా చాలా తక్కువగా ఉంటుంది. శాస్త్రవేత్తల నుంచి తెలుస్తున్న సమాచారం ప్రకారం.. నానో యూరియాను ప్రస్తుతం సుమారు 100 పంటలకు కూడా ఉపయోగించవచ్చు.అయితే ఇక దిగుబడిలో 10 శాతం వరకు పెరుగుదల ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: