పెద్ద బ్యాంకులకు గడ్డు రోజులైనా..?

MOHAN BABU
పెద్ద బ్యాంకులకు గడ్డు రోజులు ముందున్నాయని ఫైనాన్షియల్  ఎక్స్ పర్ట్స్ అంటున్నారు. గూగుల్ పే,ఫోన్ పే,పేటీఎం వంటి డిజిటల్ వాలెట్లు కూడా డిపాజిట్ తీసుకోవడం మొదలు పెట్టడమే ఇందుకు కారణమని చెబుతున్నారు. ఇది బ్యాంకులకు గొడ్డలిపెట్టు అని హెచ్చరిస్తున్నారు. మన దేశంలో అత్యధిక యూపీఐ ట్రాన్సాక్షన్ లు జరుగుతున్న ప్లాట్ ఫారాల్లో గూగుల్ పై ఒకటి. ఇకనుంచి ఇది చిన్న బ్యాంకుల కోసం తన యూజర్ల  నుంచి డిపాజిట్లు తీసుకుంటుంది. చిన్న బ్యాంకులకు పెద్దగా బ్రాంచ్ లు ఉండవు కాబట్టి ఇవి బిజినెస్లు పెంచుకునేందుకు గూగుల్ వంటి పెద్ద కంపెనీల తో చేతులు కలుపుతున్నాయి. ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ డిపాజిట్లు తీసుకోవడానికి గూగుల్ తో ఒప్పందం కుదుర్చుకుంది. గూగుల్ పే ద్వారా వచ్చే ఏడాది టేనార్ కలిగిన డిపాజిట్లకు 6.85 శాతం వడ్డీ ఇస్తామని ఈ బ్యాంకు ప్రకటించింది.

ఇతర స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు కూడా ఇదే బాటలో నడిచేందుకు రెడీ అవుతున్నాయి. గూగుల్ ఏ కాదు ఫేస్ బుక్ కూడా చిన్న వ్యాపారులకు లోన్లు ఇవ్వడానికి కొన్ని ఫిన్ టెక్ కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుంది. అమెజాన్ యూపీఐ తో పాటు చిన్న లోన్లు ఇస్తోంది. వాట్సప్ సైతం యూపీఐ సేవలు అందిస్తోంది. ఇలాంటి మల్టీనేషనల్ కంపెనీలు ఆన్లైన్ ద్వారా ఫైనాన్షియల్ ప్రొడక్టులను అందజేయడం వల్ల సంప్రదాయ బ్యాంకులకు ఖచ్చితంగా నష్టం ఉంటుంది. అంతే కాదు చాలా ఫిన్ టెక్ స్టార్టప్ లు ఆన్లైన్లో నేరుగా లోన్లు ఇస్తున్నాయి. ఈ పరిస్థితి పెద్ద బ్యాంకులకు కూడా ఇబ్బందికరమే . చైనా ఫిన్ టెక్ స్టార్ట్ అప్ లు అక్కడి సంప్రదాయ బ్యాంకింగ్ ను  దెబ్బ కొట్టాయి. ఇవే సొంతంగా లోన్లు ఇవ్వడం, డిపాజిట్లు తీసుకోవడంతో మామూలు బ్యాంకులపై పెద్ద ఎఫెక్టే పడింది. దీంతో డ్రాగన్ ప్రభుత్వం వీటిపై రిస్ట్రిక్టన్లు విధించింది. ఫలితంగా ఇవన్నీ ఇప్పుడు ఇండియా వైపు చూస్తున్నాయి. ఉదాహరణకు చైనాకు చెందిన షో మీ గ్రూపు తన మీ పే యాప్ ద్వారా భారీగా లోన్ లు ఇస్తుంది. బిల్ పేమెంట్స్ యూపీఐ ట్రాన్సక్షన్స్ వంటి ఎన్నో సేవలు అందిస్తుంది.

కేవైసీ వంటి పనులన్నింటినీ ఆన్లైన్లోనే చేసుకునే అవకాశాలు ఉండడంతో జనం బ్యాంకు క్యూల్లో నిలబడాల్సిన అవసరం ఉండటం లేదు. ఫిన్ టెక్ కంపెనీ యాప్ లో నిమిషాల్లో వాలెట్,యూపీఐ ఐడి లను క్రియేట్ చేసుకోవచ్చు. బ్యాంకుల వెబ్సైట్ యాప్స్ తో కంటే యూపీఐ ద్వారా డబ్బును  పంపడం సులువైంది. అందుకే గూగుల్ పే,ఫోన్ పే ఇండియాలో దూసుకెళ్తున్నాయి. ఈ రెండు యాప్స్ ద్వారా గత నెలలోనే 5 లక్షల కోట్ల విలువైన ట్రాన్సాక్షన్ లు జరిగాయి అంటే వీటి హవా ఎలా ఉందో ఈజీగా అర్థం చేసుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: