లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్స్ ..!

Suma Kallamadi
చివరి వారంలో గురువారం నాడు భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్ దానికి కొనసాగింపుగా నేడు కూడా భారతీయ స్టాక్ మార్కెట్స్ సెన్సెక్స్, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (నిఫ్టీ) లాభాల్లో ముగిశాయి. మార్కెట్ సమయం ముగిసే సమయానికి సెన్సెక్స్ 278 పాయింట్లు బలపడి 38974 పాయింట్ల వద్ద ముగియగా, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (నిఫ్టీ) 86 పాయింట్లు బలపడి 11503 పాయింట్ల వద్ద ముగిసింది. మార్కెట్ మొదలైనప్పటి నుండి అటు విదేశీ పెట్టుబడిదారులు, ఇటు దేశ పెట్టుబడిదారులు పెద్దఎత్తున కొనుగోలుకు ఆసక్తి చూపడంతో నేడు స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో మొదలయ్యాయి. ఒకానొక దశలో భారీగా లాభంలో సెన్సెక్స్ మిడ్ సెషన్ తర్వాత కాస్త డీలా పడింది.

ఇక నేడు నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ లో అత్యధికంగా నిఫ్టీ ఐటీ సెక్టార్ 3.6 శాతం లాభపడింది. ఇక నేడు అత్యధికంగా లాభాలు పొందిన షేర్ల విషయానికి వస్తే.. టిసిఎస్, విప్రో, టాటా స్టీల్, సన్ ఫార్మా, ఇన్ఫోసిస్ కంపెనీ లో అత్యధికంగా లాభాలు పొందిన లిస్టులో ముందుగా ఉన్నాయి. ఇక ఇందులో టిసిఎస్ కంపెనీ షేర్లు అత్యధికంగా 7 శాతం పైగా లాభాల బాటపట్టాయి. ఇక మరోవైపు బజాజ్ ఫిన్ సర్వ్, శ్రీ సిమెంట్స్, భారతి ఎయిర్టెల్, బజాజ్ ఫైనాన్స్ , గేయిల్ కంపెనీలు అత్యధికంగా నష్టపోయిన లిస్టు లో టాప్ లో ఉన్నాయి. ఇందులో బజాజ్ ఫిన్ సర్వ్ అత్యధికంగా 2.8 శాతం నష్టపోయింది.

ఇక నేడు హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర చూస్తే 530 రూపాయలు నష్టపోయి రూ. 52,380 గా, 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 490 రూపాయలు నష్టపోయి రూ. 48,020 వద్ద ముగిశాయి. ఇక కేజీ బంగారం ధర 510 రూపాయలు నష్టపోయి రూ. 60,700 కు చేరుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: