భారీ లాభాలలో ముగిసిన స్టాక్ మార్కెట్స్...!

Suma Kallamadi
గత ఆరు రోజుల నుంచి వరుస నష్టాలకు చెక్ పెడుతూ నేడు దేశీయ స్టాక్ మార్కెట్లు అనూహ్య బ్యాక్ బౌన్స్ పొందాయి. మార్కెట్ మొదలైనప్పటి నుండి ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎక్కువ ఆసక్తి చూపడంతో దేశీయ స్టాక్ మార్కెట్లు మంచి గ్యాప్ తో మొదలయ్యాయి. ఇక నేడు మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 835 పాయింట్లు లాభపడి 37,389 వద్ద, అలాగే నిఫ్టీ కూడా 245 పాయింట్లు లాభపడి 11050 వద్ద ముగిశాయి. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజి లో అన్ని రకాల రంగాలు లాభపడ్డాయి. బ్యాంకింగ్, మెటల్, మీడియా, ఆటో, ఐటీ,  ఎఫ్.ఎన్.సి.జి అన్ని రంగాలు కూడా లాభాల్లో ముగిశాయి.

ఇక నేడు నిఫ్టీ 50 లాభనష్టాల విషయానికొస్తే... అత్యధికంగా లాభాల పడిన లిస్టులో మొదటగా బజాజ్ ఫైన్ సర్వ్, ఇందుస్ ల్యాండ్ బ్యాంక్, హెచ్ సిఎల్ టెక్, సిప్లా, భారతి ఎయిర్టెల్ కంపెనీల షేర్లు లాభపడిన లిస్టులో ముందుగా ఉన్నాయి. ఇక ఇందులో బజాజ్ ఫిన్ సర్వ్ ఏకంగా ఏడు శాతం మేర లాభపడింది. ఇక మరోవైపు అత్యధికంగా నష్టపోయిన షేర్ల విషయానికి వస్తే ఎస్బిఐ లైఫ్ ఇన్సూరెన్స్, డిపిసిఎల్, యుపిఎల్, హెచ్డిఎఫ్సి లైఫ్ లో అత్యధికంగా నష్టపోయాయి. ఇందులో ఎస్బిఐ లైఫ్ ఇన్సూరెన్స్ 0.9 శాతం మేర నష్టపోయింది.

ఇక నగదు వివరాల్లోకి వస్తే.. నిన్నటి రోజున విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు ఏకంగా 1886 కోట్ల రూపాయల పెట్టుబడులను వెనక్కి తీసుకోగా, దేశి ఇన్వెస్టర్స్ లు కేవలం 189 కోట్లు మాత్రమే ఇన్వెస్ట్ చేశారు. ఇక బంగారం విషయానికి వస్తే10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ఏకంగా 500 రూపాయల మేరకు పెరిగి రూ. 52,370 కి చేరుకోగా.. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 500 రూపాయలు పెరిగి రూ. 48050 వద్ద ముగిసింది. ఇక కేజీ వెండి ధర రూ. 2300 రూపాయలు పెరిగి రూ. 59,300 కు చేరుకొంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: