పాకిస్తాన్‌.. సుప్రీంకోర్టు జడ్జిలకే రక్షణ లేదా?

Chakravarthi Kalyan
పాకిస్థాన్ లో నానాటికీ పరిస్థితులు దిగజారిపోతున్నాయి. వ్యతిరేక తీర్పులు వస్తే సుప్రీం కోర్టు జడ్జిల ఇళ్లనే తగలబెడతామని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. పాకిస్థాన్ లో ని పంజాబ్ ప్రావిన్స్ లో ఎన్నికలు జరపాల్సి ఉంది. కానీ కావాలనే ఎన్నికలు జరపడం లేదు. పంజాబ్ ప్రావిన్సు, ఖైబర పంక్తువాలో ఇమ్రాన్ ఖాన్ కు మంచి పట్టుంది. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ వర్గీయులు అక్కడ కచ్చితంగా ఎన్నికలు జరపాలని కోరుతున్నారు.

ప్రస్తుత ప్రధాని షాదాబ్ షరీప్ ఎన్నికల నిర్వహణకు ససేమిరా అంటున్నారు. మరియన్ ఔరంగ జేబు అనే పాకిస్థాన్ మహిళ సుప్రీం  కోర్టు జడ్జిలకే హెచ్చరిక జారీ చేసింది. న్యాయమూర్తుల ఇళ్లను తగలబెడతామని హెచ్చరించింది. అక్కడి న్యాయమూర్తుల పరిస్థితి ఎలా తయారైందంటే కుడిదిలో పడ్డ ఎలుకలా మారింది. ఎవరికి అనుకూలంగా తీర్పు చెప్పినా వారి మాటలు వినకుండా ఎదురు దాడి చేస్తున్నారు. పంజాబ్ ప్రావిన్సులో ఏప్రిల్ 14 వ తేదీ నాటికి ఎన్నికలు నిర్వహించాలి. కానీ ఇంకా షాబాద్ షరీప్ ప్రభుత్వం పెట్ట లేదు. దీంతో ఎన్నికల నిర్వహణపై నీలినీడలు కమ్ముకున్నాయి.

ఒక వైపు పెట్టాలని ఇమ్రాన్ ఖాన్ వర్గీయులు, వద్దని షాదాబ్ షరీఫ్ వర్గీయులు రెండు కలిసి న్యాయమూర్తులను టార్గెట్ చేస్తున్నారు. ఇలాంటి బెదిరింపుల వల్ల వారు సరైన తీర్పు ఇవ్వగలరా.. అనే సందేహలు నెలకొన్నాయి. పోనీ వారి ప్రాణాలకు రక్షణ ఉందా అంటే అది డౌటే. ఇలాంటి పాకిస్థాన్ కు సంబంధించిన వ్యక్తుల గురించి కొంతమంది ఇండియాలో సపోర్టు గా మాట్లాడుతుంటారు.

అలాంటి దాడులు చేసిన వ్యక్తి పేరు ను పెట్టుకున్న మహిళే మరియన్ ఔరంగజేబు ఇప్పుడు సుప్రీం కోర్టు న్యాయమూర్తుల ఇళ్లు కాలబెడతామని హెచ్చరించింది. అంటే ఎన్నికలు నిర్వహించేలా తీర్పు చెప్పారంటే మీ పని అయిపోయినట్లేనని నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. అక్కడ సుప్రీం కోర్టు న్యాయమూర్తులకే రక్షణ లేదు. సామాన్య ప్రజల పరిస్థితి ఎంత దారుణంగా ఉందో మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: