నిధులేవీ సార్లూ.. గగ్గోలు పెడుతున్న సర్పంచులు?

Chakravarthi Kalyan
పంచాయతీ రాజ్ వ్యవస్థ అస్థవ్యస్తంగా తయారైందని, సర్పంచ్ లు నిధులు లేక అల్లాడిపోతున్నారని తెలంగాణ పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. పంచాయతీ రాజ్ సంఘటన్ బలోపేతం చేసేందుకు నాయకులు గ్రామస్థాయి నుంచి పనులు చేయాలని మహేష్ కుమార్ గౌడ్ సూచించారు. చేసిన పనులకు డబ్బులు లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని మహేష్ కుమార్ గౌడ్ ఆందోళన వ్యక్తం చేశారు.

స్థానిక సంస్థలు ప్రతినిధుల సమస్యలపై పోరాటం చేయాలన్న అయన రాహుల్ గాంధీపై అక్రమంగా కేసులు పెట్టి ఎంపీ పదవి నుంచి తొలగించడాన్ని నిరసిస్తూ పోస్ట్ కార్డులు రాసి పంపినట్లు మహేష్ కుమార్ గౌడ్ చెప్పారు. టీపీసీసీ రాష్ట్ర రాజీవ్ గాంధీ పంచాయతీ రాజ్ సంఘటన్ సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పంచాయతీ రాజ్ సంఘటన్ చైర్మన్ రాచమల్ల సిద్దేశ్వర్ అధ్యక్షతన జరిగింది. ఇందులో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, ఉపాధ్యక్షులు చామల కిరణ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: