TSPSCపేపర్లు.. పల్లీబఠాణీల్లా అమ్ముకున్నారా?

Chakravarthi Kalyan
పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ప్రశ్నాపత్రాలను పల్లీ బఠానీల్లా అమ్ముకున్నారని అఖిల పక్ష పార్టీల నేతలు రౌండ్ టేబుల్ సమావేశంలో ఆరోపించారు. విద్యార్ధి సంఘాలు, నిరుద్యోగులు చేసే పోరాటాలకు రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు మద్దతుగా నిలువాలని విద్యార్ధి సంఘాలు, ప్రజా సంఘాల నాయకులు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వానికి నిరుద్యోగుల పట్ల ఏమాత్రం చిత్తశుద్ది లేదని ఆరోపించారు. పేపర్‌ లీకేజి వ్యవహారంలో ఇద్దరే తప్పు చేసినట్లు మంత్రి కేటీఆర్‌ చెప్పడం ఏంటని అఖిల పక్ష పార్టీల నేతలు ప్రశ్నించారు.
రాజశేఖర్‌, ప్రవీణ్‌ల వెనుక పెద్ద తలకాయలున్నాయని ఆరోపించారు. నిరుద్యోగులకు యువజన కాంగ్రెస్‌, ఎన్‌ఎస్‌యుఐలు అండగా నిలుస్తాయని అఖిల పక్ష పార్టీల నేతలు స్పష్టం చేశారు.  పేపర్‌ లీకేజి వ్యవహారంపై ప్రత్యేక రాష్ట్రం కోసం ఏర్పాటైనట్లు ప్రత్యేక ఐక్య కార్యాచరణ రూపొందించి పోరాటం సాగించాలని అఖిల పక్ష పార్టీల నేతలు అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో ఇంత జరుగుతున్నా...ముఖ్యమంత్రి కేసీఆర్‌ బయటకు రాకపోవడం దురదృష్టకరమని అఖిల పక్ష పార్టీల నేతలు అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: