రామ్‌ గోపాల్‌ వర్మతో పెట్టుకున్న టీడీపీ?

Chakravarthi Kalyan
ఇటీవల నాగార్జున యూనివర్శిటీకీ వెళ్లిన దర్శకుడు వర్మ అక్కడ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. విద్యార్థులు ఎంజాయ్ చేయాలని.. రంభ, ఊర్వశి, మేనకలు భూమి మీదే ఉన్నారని.. వారని అనుభవించాలని అన్నారు. దర్శకుడు రాంగోపాల్ వర్మ, నాగార్జున విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్లపై సుమోటోగా విచారణ జరిపి చర్యలు తీసుకోవాలంటూ తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య.. జాతీయ మహిళ కమిషన్, UGC ఛైర్ పర్సన్లకు లేఖ రాశారు. మహిళలను కించ పరిచేలా దర్శకుడు ఆర్జీవీ కామెంట్లు చేశారంటూ తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఫిర్యాదు చేశారు.

యూనివర్శిటీలో జరిగే కార్యక్రమానికి మహిళలను కించపరిచే వ్యక్తిగా ముద్రపడ్డ ఆర్జీవీని పిలవడంపై తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య  అభ్యంతరం వ్యక్తం చేశారు. నాగార్జున యూనివర్శిటీ వీసీ ప్రొఫెయర్ వి. రాజశేఖర్, వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఆర్జీవీపై చర్యలు తీసుకోవాలని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య డిమాండ్.

మరింత సమాచారం తెలుసుకోండి:

rgv

సంబంధిత వార్తలు: