కేసీఆర్‌కు జగ్గారెడ్డి లేఖ.. వాళ్లకు డ్యూటీ ఇవ్వండి?

Chakravarthi Kalyan
250 మంది హోంగార్డులను విధులోకి తీసుకోవాలని కోరుతూ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు  సంగారెడ్డి కాంగ్రెస్‌ ఎమ్మెల్యే తూర్పు జగ్గారెడ్డి లేఖ రాశారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆర్డర్ కాపీ లేదని 250మంది హోం గార్డులను విధుల్లో నుంచి తొలిగించారని.. అప్పటికే వారంతా 10 సంవత్సరాలు వివిధ జిల్లాలల్లో హోం గార్డులుగా విధులు నిర్వహించారని.. ఈ 250మంది హోం గార్డులకు గుర్తింపు కార్డులు, బ్యాంకు ఖాతాలు, హెల్త్ కార్డ్స్ అన్ని ఉన్నాయని..కానీ ఆర్డర్ కాపీ లేదని వారిని విధుల్లో నుంచి తొలిగించడం అన్యాయమని ఎమ్మెల్యే తూర్పు జగ్గారెడ్డి అన్నారు.

10 సంవత్సరాల నుంచి ఉద్యోగాలు లేక వారి కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదురుకుంటున్నారని.. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత సిఎం కేసీఆర్...ఈ 250 మందిని విధులోకి తీసుకుంటామని అసెంబ్లీలో హామీ ఇచ్చారని.. కానీ ఎందుకో వారిని విధులోకి తీసుకోవడంలో జాప్యం జరిగిందని ఎమ్మెల్యే తూర్పు జగ్గారెడ్డి తెలిపారు. అందుకే మీ దృష్టికి మరోసారి మీకు గుర్తు చేస్తూ లేఖ రాస్తున్నానన్న ఎమ్మెల్యే తూర్పు జగ్గారెడ్డి.. ఈ 250మందిని వెంటనే విధులోకి తీసుకోవాలని కోరుతున్నానన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: