ఏపీ రాజకీయాల్లో భూకంపం.. పెద్దల అరెస్టులు తప్పవా?
ప్రస్తుత ప్రభుత్వంలో సిఐడి వారు వివరములు అడిగారని.. సీమెన్స్ విభాగానికి చెందిన వివరములు అన్ని క్రోడీకరించి సిఐడి వారికి అందజేయడం జరిగిందని.. ఎండి, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ గా... 2019 మార్చికి ముందు టైంలో వ్యవహారాలపై ఎంక్వైరీ చేసి నివేదిక ఇవ్వటం జరిగిందని ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ ఎండీ అర్జా శ్రీకాంత్ తెలిపారు. అందులో భాగంగా వారికి కొన్ని అనుమానాలు వచ్చాయని.. ఆ అనుమానాలు క్లారిఫై చేయటానికి 160 సెక్షన్ ప్రకారము, మార్చి 9వ తేదీన విజయవాడ సిఐడి విభాగానికి వెళ్లి అవసరమైన క్లారిఫికేషన్ ఇస్తానని.. గతంలో కూడా వెళ్లి వివరణ ఇచ్చి వచ్చానని ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ ఎండీ అర్జా శ్రీకాంత్ తెలిపారు.